Volkswagen: ఫోక్స్‌వ్యాగన్‌ కార్ల ధరల పెంపు.. ఎంతంటే?

ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్‌ తమ కార్ల ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించింది....

Published : 21 Sep 2022 16:33 IST

దిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్‌ తమ కార్ల ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. అయితే, ఏయే మోడల్‌పై ఎంత మేర పెంచారన్నది మాత్రం వెల్లడించలేదు. మొత్తంగా అన్ని కార్లపై కలిపి రెండు శాతం వరకు ధరలు పెరుగుతాయని తెలిపింది. కొత్త ధరలు అక్టోబరు 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. తయారీ వ్యయాలు పెరిగిన కారణంగానే ధరల్ని పెంచాల్సి వస్తోందని తెలిపింది. ఈ కంపెనీ భారత్‌లో విర్టస్‌, టైగన్‌, టిగువాన్‌ మోడళ్లను విక్రయిస్తోంది.

ప్రస్తుతం ఫోక్స్‌వ్యాగన్‌ కార్ల ఎక్స్‌షోరూం ధరల శ్రేణి ఇలా ఉంది..

  • విర్టస్‌: రూ.11.21-17.91 లక్షలు
  • టైగన్‌: రూ.11.40-18.60 లక్షలు
  • టిగువాన్‌: రూ.32.79 లక్షలు
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని