WhatsApp: వాట్సప్‌లో మరో ‘వ్యూ వన్స్‌’ ఫీచర్!

WhatsApp: ఇప్పటివరకు ఫొటోలు, వీడియోలకు మాత్రమే పరిమితమైన ‘వ్యూ వన్స్‌’ ఫీచర్‌ని ఇకపై వాయిస్‌ మెసేజ్‌లకు అందించేందుకు వాట్సప్‌ సిద్ధమైంది.

Published : 21 Oct 2023 01:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ వాట్సప్‌ (WhatsApp) కొత్త ఫీచర్‌ని తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు వ్యక్తిగత చాట్‌ల భద్రతలో భాగంగా ఎన్నో ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సప్‌ ఇప్పుడు మరో ఫీచర్‌ని అందించేందుకు సిద్ధమైంది. ‘వ్యూ వన్స్‌ ఫర్‌ వాయిస్‌ నోట్స్‌’ (View Once mode for voice notes) పేరుతో కొత్త ఫీచర్‌ని తీసుకురానుంది.

నాలుగు నెలల గరిష్ఠానికి బంగారం ధర

ఇప్పటికే ఫొటోలు, వీడియోలకు సంబంధించి ‘వ్యూ వన్స్‌’ ఫీచర్‌ వాట్సాప్‌లో అందుబాటులో ఉంది. ఏదైనా ఫొటో/ వీడియోను ఒకసారి మాత్రమే చూడొచ్చు. దాన్ని స్క్రీన్‌షాట్‌ తీసుకోవడం కూడా కుదరదు. ఇప్పుడు ఇదే ఫీచర్‌ను వాయిస్‌ నోట్‌ ఫార్మాట్‌కు సైతం జోడించనుంది. వాయిస్‌ రికార్డ్‌ను సెండ్‌ చేసే సమయంలోనే వ్యూ వన్స్‌ ఆప్షన్‌ ఎంపిక చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలను ‘వెబ్‌ఇన్ఫో’ తన బ్లాగ్‌లో పంచుకుంది. ఇలా వ్యూవన్స్‌లో పంపే వాయిస్‌ మెసేజ్‌లను మరో సారి వినటానికి వీలుండదని తెలిపింది. ప్రస్తుతం కొంతమంది ఆండ్రాయిడ్‌ బీటా వినియోగదారులకు మాత్రమే ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. పూర్తిస్థాయిలో ఎప్పుడు తీసుకొస్తారనే విషయం తెలియరాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని