YouTube: క్రియేటర్లకు యూట్యూబ్ గుడ్‌న్యూస్.. వీడియో ఎడిటింగ్‌కు ఫ్రీ యాప్
YouTube: వీడియో క్రియేటర్ల కోసం యూట్యూబ్ కొత్త యాప్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. అలాగే డ్రీమ్ స్క్రీన్ అనే మరో నూతన ఫీచర్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది.
ఇంటర్నెట్‌డెస్క్: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ (YouTube) వీడియో క్రియేటర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. వీడియోలను సులువుగా రూపొందించుకునేలా ‘యూట్యూబ్ క్రియేట్’ పేరిట కొత్త యాప్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా రూపొందించిన డ్రీమ్ స్క్రీన్ (Dream Screen) ఫీచర్‌ను కూడా టెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీని సాయంతో షార్ట్ వీడియోలకు (Shorts) ఏఐ ఆధారంగా రూపొందించిన వీడియోలు, బ్యాక్‌గ్రౌండ్‌లో ఇమేజ్‌లు జోడించటానికి వీలుంటుంది.
‘మేడ్ ఆన్ యూట్యూబ్’ పేరిట గూగుల్ గురువారం ఓ ఈవెంట్ నిర్వహించింది. ఈ సందర్భంగా యూట్యూబ్ క్రియేట్ (YouTube Create) యాప్‌ను, డ్రీమ్ స్క్రీన్ గురించి యూట్యూబ్ ప్రకటించింది. కొత్త జనరేటివ్ ఏఐ ఆధారిత యాప్‌లో ఎడిటింగ్ ట్రిమ్మింగ్, ఆటోమేటిక్ క్యాప్షనింగ్, వాయిస్ ఓవర్, ట్రాన్సిషన్స్ వంటి ఫీచర్లు ఉంటాయి. టిక్‌టాక్ మాదిరిగానే బీట్-మ్యాచింగ్ టెక్నాలజీతో ఉండే రాయల్టీ ఫ్రీ మ్యూజిక్‌ను వినియోగదారులు వాడుకోవచ్చు.
కెనడాలో ‘మహీంద్రా’ అనుబంధ సంస్థ మూత!
‘క్రియేటివ్‌గా వీడియోలు రూపొందించటం చాలా కష్టమని మాకు తెలుసు. అందులోనూ మెదటిసారి వీడియోను అప్లోడ్ చేయాలంటే చాలా శ్రమించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి, అలాగే ఎవరైనా వీడియోలను క్రియేట్ చేయాలన్నా, షేర్ చేయాలన్నా సులువుగా ఉండేందుకు ఈ అప్లికేషన్‌ను అభివృద్ధి చేశాం. షార్ట్, లాంగ్ వీడియోలను రూపొందించడానికి దీన్ని తీసుకొచ్చాం’ అని యూట్యూబ్ కమ్యూనిటీ ప్రోడక్ట్స్ వైస్ ప్రెసిడెంట్ టోనీ తెలిపారు. ఇదో ఫ్రీ యాప్. ప్రస్తుతం భారతదేశం, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, ఇండోనేషియా, కొరియా, సింగపూర్‌తో సహా ఎంపిక చేసిన మార్కెట్లలో ఆండ్రాయిడ్‌లో బీటా యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. వచ్చే ఏడాది ఐఫోన్లో ఈ యాప్‌ను ప్రవేశపెడతామని యూట్యూబ్ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Mozilla Firefox: బ్రౌజర్‌ను అప్డేట్ చేసుకోండి.. ఫైర్ఫాక్స్ యూజర్లకు కేంద్రం సూచన
మొజిల్లా ఫైర్ఫాక్స్ ఉపయోగిస్తున్న యూజర్లు వెంటనే తమ కంప్యూటర్లలో బ్రౌజర్‌ను అప్డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సెర్ట్-ఇన్ సూచించింది. -
Oneplus 12: రిలీజ్‌కు ముందే వన్‌ప్లస్ 12 లుక్ లీక్ (pics)
Oneplus 12: వన్‌ప్లస్ 12 ఫోన్ చైనాలో డిసెంబర్ 4న రిలీజ్ కానుంది. విడుదలకు ముందు దీనికి సంబంధించిన చిత్రాలు బయటకొచ్చాయి. -
Aitana Lopez: ఈ ఏఐ మోడల్ సంపాదన నెలకు ₹9 లక్షలు
ఏఐతో ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో.. స్పెయిన్‌కు చెందిన ఓ మోడల్ ఏజెన్సీ ఏఐ మోడల్‌ను అభివృద్ధి చేసింది. -
Airtel: నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో ఎయిర్టెల్ కొత్త రీఛార్జ్ ప్లాన్..
Airtel: ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను తన యూజర్ల కోసం తీసుకొచ్చింది. -
google pay: గూగుల్ పేలో ఇకపై మొబైల్ రీఛార్జులపై ఫీజు!
Google pay Recharge: గూగుల్‌పేలో ఇక మొబైల్ రీఛార్జులపై స్వల్ప మొత్తంలో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రీఛార్జి మొత్తం బట్టి కన్వీనియన్స్ ఫీజు ఆధారపడి ఉంటుంది. -
Instagram: ఇన్‌స్టా యూజర్లు ఇక రీల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు
Instagram: పబ్లిక్ వీడియోలను సులువుగా డౌన్లోడ్ చేసుకొనే సదుపాయాన్ని ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్స్టాగ్రామ్ తీసుకొచ్చింది. దాన్ని ఎలా ఎనేబల్ చేసుకోవాలంటే? -
Elon Musk: ‘ఎక్స్’లో మరో మార్పు.. ఆదాయం తగ్గుతున్న తరుణంలో మస్క్ కీలక నిర్ణయం!
Elon Musk: సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ విషయంలో గత నెలలో తీసుకున్న ఓ నిర్ణయాన్ని ఎలాన్ మస్క్ ఉపసంహరించుకున్నారు. ఎక్స్ వేదికపై షేర్ చేసే లింక్స్‌కు హెడ్లైన్ కనిపించేలా తిరిగి మార్పులు చేస్తున్నట్లు వెల్లడించారు. -
Google Pay: ఈ యాప్స్ వాడొద్దు.. యూజర్లకు గూగుల్ పే అలర్ట్
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాలో మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో గూగుల్ పే యాప్ యూజర్లకు కీలక సూచన చేసింది. -
Oneweb: శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్.. వన్‌వెబ్‌కు స్పేస్ రెగ్యులేటర్ నుంచి అనుమతులు
వన్‌వెబ్‌కు శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలకు సంబంధించి స్పేస్ రెగ్యులేటర్ నుంచి అనుమతులు మంజూరయ్యాయి. స్పెక్ట్రమ్ కేటాయింపు జరగాల్సి ఉంది. -
OnePlus: వన్‌ప్లస్ ఏఐ మ్యూజిక్ స్టూడియో.. నిమిషాల్లో కొత్త పాట రెడీ
OnePlus AI Music Studio: మ్యూజిక్ డైరెక్టర్‌తో పనిలేకుండా, లిరిక్స్ రాయడం రాకున్నా సులువుగా టూల్ సాయంతో పాటను జెనరేట్ చేయొచ్చని తెలుసా?వన్‌ప్లస్ స్టూడియో ఆ సౌకర్యం కల్పిస్తోంది. -
వాట్సప్‌లో ఇ-మెయిల్ వెరిఫికేషన్.. ఏఐ చాట్‌బాట్!
వాట్సప్‌లో కొత్తగా ఇ-మెయిల్ వెరిఫికేషన్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఏఐ చాట్‌బాట్‌ను వాట్సాప్ కొందరు యూజర్లకు తీసుకొచ్చింది. -
Jio Cloud PC: తక్కువ ధరకే క్లౌడ్ సర్వీస్‌తో జియో కొత్త ల్యాప్‌టాప్!
జియో మరో కొత్త ల్యాప్‌టాప్‌ను పరిచయం చేయనుంది. ఇది పూర్తిగా క్లౌడ్ సర్వీస్ ఆధారంగా పనిచేస్తుంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ డివైజ్‌ను త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. -
ఫైబర్ యూజర్ల కోసం BSNL నుంచి వాట్సాప్ చాట్‌బాట్
బీఎస్ఎన్ఎల్ సంస్థ వాట్సప్ చాట్‌బాట్ సేవలను ప్రారంభించింది. 1800 4444 నంబర్‌కు వాట్సప్‌లో హాయ్ అని పంపంపించి ఫైబర్ సేవలు పొందొచ్చు. -
Instagram: ఇన్‌స్టాలో కొత్త ఎడిటింగ్ టూల్స్.. ఇకపై పోస్టులు నచ్చిన వారు మాత్రమే చూసేలా!
Instagram: ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్‌ని యూజర్లకు పరిచయం చేసింది. అదే విధంగా రీల్స్‌లో మరిన్ని వినూత్నమైన ఫీచర్లను తీసుకొచ్చింది. -
Password: అత్యధిక మంది వాడుతున్న పాస్వర్డ్ ఏంటో తెలుసా?
Password: ‘‘123456’’ను నార్డ్‌పాస్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ ‘అత్యంత వరస్ట్ పాస్వర్డ్’గా అభివర్ణించింది. దీన్ని హ్యాకర్లు కేవలం ఒక్క సెకన్లో కనిపెట్టగలరని తెలిపింది. -
OnePlus Speakers: వన్‌ప్లస్ నుంచి త్వరలో స్పీకర్లు?
OnePlus Speaker: ‘గెట్ రెడీ టు మేక్ సమ్ మ్యూజిక్’ క్యాప్షన్‌తో ఇన్‌స్టా పోస్ట్‌లో ఓ చిన్న వీడియోను వన్‌ప్లస్ పోస్ట్ చేసింది. దీంతో కంపెనీ త్వరలో స్పీకర్లను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
Google Photos: గూగుల్ ఫొటోస్‌లో గజిబిజి లేకుండా.. రెండు కొత్త ఏఐ ఫీచర్లు
Google Photos: గూగుల్ ఫొటోస్ గ్యాలరీని మరింత సమర్థంగా సర్దేలా కంపెనీ రెండు కొత్త ఏఐ ఫీచర్లను ప్రవేశపెట్టింది. అవేంటో చూద్దాం! -
Jio Cinema: చిన్నారుల ఎంటర్టైన్మెంట్.. పోకెమాన్తో జియో సినిమా జట్టు
Jio cinema: జియో సినిమా వేదికగా చిన్నారులను అలరించేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సిద్ధమైంది. ఇందుకోసం పోకెమాన్ సంస్థతో జట్టుకట్టింది. -
IND vs NZ: డిస్నీ+ హాట్‌స్టార్ సరికొత్త రికార్డ్.. ఫైనల్లో పరిస్థితి ఏంటో!
Disney+ Hotstar: భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీస్‌లో సరికొత్త వ్యూయర్షిప్ రికార్డు నమోదైంది. డిస్నీ+ హాట్‌స్టార్ వేదికగా ఓ దశలో 5.3 కోట్ల మంది ఈ మ్యాచ్‌ను వీక్షించారు. -
WhatsApp: వాట్సప్ బ్యాకప్.. ఇక గూగుల్ అకౌంట్ స్టోరేజీ లిమిట్‌లోనే!
WhatsApp: ఇకపై వాట్సప్‌లో మీడియా బ్యాకప్ మొత్తం గూగుల్ అకౌంట్ స్టోరేజీలో చేరనుంది. ఒకవేళ అదనపు స్టోరేజీ అవసరం పడితే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. -
Samsung: ఏఐ రేసులోకి శాంసంగ్.. గాస్ పేరుతో సేవలు!
Samsung: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్ (Samsung) ఏఐ సేవల్ని అందించేందుకు సిద్ధమైంది. యూజర్ల పనుల్ని సులభతరం చేయటంలో భాగంగానే గాస్ పేరుతో ఏఐ సేవల్ని ఆవిష్కరించింది.