మంచి గాలీ అవసరమే!

గర్భిణిగా ఉండగా శిశువు ఆరోగ్యం కోసం మంచి పోషకాహారం తీసుకోవాలని తెలుసు. అదొక్కటే సరిపోదు... తాజా గాలి కూడా అవసరమే అని తెలుసా? అవును...

Published : 04 Jun 2021 01:49 IST

ర్భిణిగా ఉండగా శిశువు ఆరోగ్యం కోసం మంచి పోషకాహారం తీసుకోవాలని తెలుసు. అదొక్కటే సరిపోదు... తాజా గాలి కూడా అవసరమే అని తెలుసా? అవును... కాలుష్యం నిండిన గాలి వల్ల ఒక్క ఆసియాలోనే ఏటా నాలుగులక్షల గర్భస్థ శిశువులు అమ్మ కడుపులోనే తుదిశ్వాస విడుస్తున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి...

మనదేశం సహా... పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లలోని మహిళలు కాలుష్యం కారణంగా అత్యధిక స్థాయిలో గర్భస్రావాలకు గురవుతున్నారని లాన్సెట్‌ కథనాలు చెబుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం... గాలిలో ఉండాల్సిన సగటు పీఎమ్‌ (పార్టిక్యులేట్‌ మేటర్‌) కన్నా మనదేశంలో కాలుష్య స్థాయులు అధికంగా ఉన్నాయి. దాని ఫలితంగానే గడిచిన పదేళ్ల కాలంలో గర్భస్రావాల సంఖ్య పెరుగుతూ వచ్చిందని అధ్యయనాలు చెబుతున్నాయి. వరుసగా జరిగే గర్భస్రావాలు స్త్రీల మానసిక, ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులని దెబ్బతీస్తున్నాయని ఇదే విషయంపై అధ్యయనం చేసిన చైనీస్‌ అకాడెమీ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ సంస్థ చెబుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్