రాయల్‌ సొసైటీలో మన స్వెత్లానా!

లండన్‌లోని రాయల్‌ సొసైటీ ఫెలోషిప్‌ అందుకోవడం అంటే... ప్రపంచ మేధావుల సరసన స్థానం సంపాదించుకోవడమే. అలాంటి ఘనతను తాజాగా భువనేశ్వర్‌కి చెందిన స్వెత్లానా మహాపాత్ర సాధించారు.

Published : 26 Apr 2024 02:04 IST

లండన్‌లోని రాయల్‌ సొసైటీ ఫెలోషిప్‌ అందుకోవడం అంటే... ప్రపంచ మేధావుల సరసన స్థానం సంపాదించుకోవడమే. అలాంటి ఘనతను తాజాగా భువనేశ్వర్‌కి చెందిన స్వెత్లానా మహాపాత్ర సాధించారు. 269 ఏళ్ల నాటి ఈ సంస్థలో ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 30,000 మంది ఆవిష్కర్తలు సభ్యులుగా ఉన్నారు. స్వెత్లానా పదో తరగతి వరకూ ఒడిశాలోని బరంపుర్‌లో చదివింది. ఆపై ఐఐఐటీ భువనేశ్వర్‌ నుంచి బీటెక్‌, ఎక్స్‌ఐఎమ్‌బీ నుంచి ఎంబీఏ పూర్తి చేసింది. రిసెర్చర్‌గా, మోడల్‌గా సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా రాణిస్తోంది. ఆమె ఓ మల్టీ నేషనల్‌ కంపెనీలో టెక్నాలజీ కన్సల్టెంట్‌గానూ పనిచేస్తోంది. వివిధ రంగాల్లో బహుముఖ ప్రతిభ చూపి, ఈ ఫెలోషిప్‌ని అందుకుంది. జెనీవాలోని వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ గ్లోబల్‌ షేపర్‌గా గుర్తింపునిచ్చింది. డబ్ల్యూఎఫ్‌ గ్లోబల్‌ షేపర్స్‌ కమ్యూనిటీ అనేది యూత్‌ లీడర్స్‌ నెట్‌వర్క్‌. యువత అసాధారణ సామర్థ్యం, గణనీయమైన విజయాలను మదింపు చేసి ఈ అవకాశం కలిగిస్తారు. ఇక, పరిశోధకురాలిగా స్వెత్లానా డిజిటల్‌ మామోగ్రామ్స్‌ కోసం డిటెక్షన్‌ ప్రొసీజర్స్‌ అనే అంశం మీద పరిశోధనా పత్రాన్నీ రాసింది. దీని ద్వారా రొమ్ము క్యాన్సర్‌తో మరికొన్ని ఇబ్బందులను గుర్తించడానికి టెక్‌బేస్డ్‌ ప్రత్యామ్నాయాలను అందించడానికి అధునాతన ఇమేజింగ్‌ పద్ధతులను ఉపయోగించే విధానాన్ని వివరించింది. మోడల్‌గానూ స్వెత్లానా ఐఐఎఫ్‌ఏ ఫ్యాషన్‌ అవార్డ్స్‌(2023), ఇంటర్నేషనల్‌ ఫ్యాషన్‌ వీక్‌(2022) వంటి వేదికలమీదా మెరిసింది. ఇక సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఇన్‌స్టాలో ఎనభైవేలమందికిపైగా ఫాలోయర్లను కలిగి ఉంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్