ప్రయోగాలతో నేర్పిద్దామా?

ఏడాది పాటు పుస్తకాలతో కుస్తీ పట్టిన పిల్లలకు ఆటవిడుపు వినోదాన్నే కాదు... విజ్ఞానాన్నీ అందిస్తే బాగుంటుంది కదా! చిన్న చిన్న సైన్స్‌ ప్రయోగాలు వారిలో కొత్త విషయాలను తెలుసుకోవాలన్న ఉత్సాహాన్ని ఇస్తాయి.

Updated : 26 Apr 2024 14:20 IST

ఏడాది పాటు పుస్తకాలతో కుస్తీ పట్టిన పిల్లలకు ఆటవిడుపు వినోదాన్నే కాదు... విజ్ఞానాన్నీ అందిస్తే బాగుంటుంది కదా! చిన్న చిన్న సైన్స్‌ ప్రయోగాలు వారిలో కొత్త విషయాలను తెలుసుకోవాలన్న ఉత్సాహాన్ని ఇస్తాయి. ఉదాహరణకు వినెగర్‌తో బేకింగ్‌ సోడా చర్య జరిపినప్పుడు కార్బన్‌డయాక్సైడ్‌ వాయువు ఉత్పత్తి అవుతుంది. దాన్ని పిల్లలకు ప్రత్యక్షంగా చూపించేందుకు ఓ గాజు గ్లాసులోకి 1/3 వంతు వినెగర్‌ తీసుకోండి. ఆపై అందులో చెంచా బేకింగ్‌ సోడా వేస్తే సరి. ఈ రెండూ కలిసినప్పుడు నీళ్లు నురగలు/బుడగలు కక్కుతూ సీసా బయటకి పొంగుతాయి. ఆ బుడగలే కార్బన్‌ డయాక్సైడ్‌ వాయువు అని చెబితే వాళ్లకి థ్రిల్లింగ్‌గా ఉంటుంది. దాంతో మరో ప్రయోగం చేద్దామా అని మిమ్మల్నే అడుగుతారు.

ఈ వేసవి సెలవుల్లో మీ పిల్లలకు ఎలాంటి నైపుణ్యాలు నేర్పించాలనుకుంటున్నారు?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్