ధవళవర్ణంలో దేవకన్యలా..!

వార్డ్‌రోబ్‌ ముందు నిల్చొని ‘ఏం వేసుకోవాలబ్బా’ అన్న సందేహం వచ్చిన ప్రతిసారీ ‘తెలుపు’ రంగుకి ఓటెయ్యమంటారు ఫ్యాషన్‌ నిపుణులు. ‘వైట్‌ ఈజ్‌ ఆల్వేస్‌ రైట్‌’ అనేది వారి నినాదం. అందుకు కారణాలు ఏమిటంటే...

Published : 26 Apr 2024 02:08 IST

ఎండవేళ...

వార్డ్‌రోబ్‌ ముందు నిల్చొని ‘ఏం వేసుకోవాలబ్బా’ అన్న సందేహం వచ్చిన ప్రతిసారీ ‘తెలుపు’ రంగుకి ఓటెయ్యమంటారు ఫ్యాషన్‌ నిపుణులు. ‘వైట్‌ ఈజ్‌ ఆల్వేస్‌ రైట్‌’ అనేది వారి నినాదం. అందుకు కారణాలు ఏమిటంటే...

తెలుపు వేసుకున్నవారికే కాదు... చూపరులకూ తెలియకుండానే ప్రశాంతతను అందిస్తుంది. ఏ రంగుతోనైనా ఇట్టే జత కట్టేస్తుంది. అందుకే ఫ్యాషన్‌ ప్రపంచంలో దీనిది ఎప్పుడూ ప్రత్యేక స్థానమే! సంప్రదాయపరంగానూ పవిత్రత, శాంతి, స్వచ్ఛతకు చిహ్నాలుగా భావిస్తాం. వివాహ వేడుకలోనూ ధవళ వర్ణానికి చోటిస్తాం. ఇదంతా సరే కానీ... ఇప్పుడు ఈ రంగు ప్రస్తావన ఎందుకంటారా? అసలే వేసవి. మండే ఎండలకు తోడు... ఉక్కిరిబిక్కిరి చేసే ఉక్కపోత ఒకటి. వాతావరణం ఎలాగున్నా తమకంటూ ఓ ప్రత్యేకత ఉండాలి. ఎల్లప్పుడూ ‘పర్‌ఫెక్ట్‌’గా ఉండాలి అనుకుంటుంది ఈ తరం. అలాంటివారికి తాజాగా కనిపించేలా మాయ చేసే ‘వైట్‌’నే సూచిస్తున్నారు ఫ్యాషనిస్టులు. పైగా ఇప్పుడు ‘ఆల్‌ వైట్‌’ స్టైల్‌ స్టేట్‌మెంట్‌గానూ మారింది. కాస్త వదులుగా ఒంటికి హాయినిచ్చే కాటన్‌, లినెన్‌, ఖాదీ రకాలను ఎంచుకుంటే సరి. మేనికీ చల్లదనం, రోజంతా ఉత్సాహంగానూ ఉండొచ్చు.

కుర్తీ-ప్యాంట్‌, జీన్స్‌ మీద టాప్‌, లాంగ్‌ స్కర్ట్‌- క్రాప్‌టాప్‌, రఫుల్‌ ఫ్రాక్‌... మీ స్టైల్‌కి తగ్గట్టుగా ఎంచుకోవడమే తరవాయి. మరి వేడుకలప్పుడో అంటే... దానికీ సిద్ధమైన డిజైన్లు మార్కెట్‌లో ఉన్నాయి. కుర్తీ- పెన్సిల్‌ కట్‌ ప్యాంట్‌, షరారా, సైడ్‌ స్లిట్‌, ఫ్రంట్‌ స్లిట్‌ లాంగ్‌ ఫ్రాంక్‌లు, లెహెంగాలూ, చీరలకూ కొదవేం లేదు. అవసరమైతే డ్రెస్‌లకు కలంకారీ, పట్టు, డై వేసిన భిన్న రకాల దుప్పట్టాలను జోడించుకుంటే సరి. తెలుపు వస్త్రాలకు ఎక్కువ నగల అవసరమూ ఉండదు. అంటే మినిమల్‌ మంత్రం పనిచేస్తుందన్న మాట. కాలేజీ అయినా, ఆఫీసుకైనా... వేడుకలైనా... స్నేహితులతో సరదా సమయమైనా కళ్లు మూసుకుని తెలుపును ఎంచేసుకోండి. ప్రకృతి కాంతలా... మోడరన్‌ దేవకన్యలా మెరిసిపోతారంటే నమ్మండి.


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు,  సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్