close
కొత్త సినిమాలు
‌ఉత్కంఠంగా ‘ఖైదీ’ టీజర్‌

‘ఇతడి తల తెచ్చిస్తే ఎంతైనా ఇస్తా..’

చెన్నై: తమిళ స్టార్‌ కార్తి కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ‘ఖైదీ’. లోకేష్‌ కనకరాజ్‌ దర్శకుడు. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా టీజర్‌ విడుదలైంది. ఇందులో కార్తి ఖైదీ పాత్రను పోషిస్తున్నారు. ఓ చేతికి బేడీలు వేసుకుని, లారీ డ్రైవ్‌ చేస్తూ డీ గ్లామర్‌ లుక్‌లో కనిపించారు.

‘ఇతడి తల తెచ్చి ఇచ్చిన వాడికి.. జీవితాంతం బతికేందుకు కావాల్సినంత డబ్బు ఇస్తా’ అని విలన్‌ వందల మంది రౌడీలతో చెప్పడం ఆసక్తికరంగా అనిపించింది. ఓ రాత్రి ఏం జరిగిందనే కథాంశంతో ఈ చిత్రాన్ని తీశారు. టీజర్‌ మొత్తం రాత్రి సన్నివేశాలతోనే సాగింది. చివరిలో కార్తి నేలపై కూర్చుని చికెన్‌ తింటూ ఇచ్చిన పోజు హైలైట్‌గా నిలిచింది. ఆద్యంతం ఉత్కంఠం కల్గించేలా ఉన్న ఈ ప్రచార చిత్రం అంచనాల్ని పెంచింది.

 


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.