close
హాలీవుడ్
అభిమానికి ప్రియాంక దంపతుల సర్‌ప్రైజ్‌

సుపత్రికి వెళ్లి మరీ..

ఇంటర్నెట్‌డెస్క్‌: బాలీవుడ్‌ తార ప్రియాంకా చోప్రా, ఆమె భర్త, గాయకుడు నిక్‌ జొనాస్‌ ఓ అభిమానిని ఆశ్చర్యపరిచారు. నిక్‌తోపాటు ఆయన సోదరులు కూడా సంగీతం కళాకారులే. జొనాస్‌ బ్రదర్స్‌ అంతా కలిసి ఇప్పటికే అనేక వేదికలపై సంగీత ప్రదర్శనలు ఇచ్చి, మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. కాగా శనివారం జరిగిన మ్యూజిక్‌ కాన్సర్ట్‌కు ఓ అభిమాని రాలేకపోయింది. ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న జోనస్‌ బ్రదర్స్‌ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆసుపత్రికి వెళ్లి ఆమెను సర్‌ప్రైజ్‌ చేశారు. బ్రదర్స్‌తోపాటు ప్రియాంక కూడా ఆమెతో ముచ్చటించారు. ఈ సందర్భంగా తీసిన వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది.

న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో జరిగిన కార్యక్రమానికి ప్రియాంక కొన్ని రోజుల క్రితం బాలీవుడ్‌ స్టార్‌ అనుపమ్‌ ఖేర్‌ను ఆహ్వానించారు. ఆయన కార్యక్రమంలో పాల్గొని.. ఎంజాయ్‌ చేశారు. ఈ సందర్భంగా ప్రియాంకకు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ధన్యవాదాలు చెప్పారు. నిక్‌ ప్రదర్శన అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు.



 





Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.