Car prices: వచ్చే ఏడాది పెరగనున్న కార్ల ధరలు.. ఎందుకంటే?

వచ్చే ఏడాది కార్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. బీఎస్‌-6 రెండో దశ ప్రమాణాలకు అనుగుణంగా కార్ల తయారీ సంస్థలు తమ వాహనాలను అప్‌గ్రేడ్‌ చేయాల్సి ఉంది. 

Published : 09 Oct 2022 16:37 IST

దిల్లీ: వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి కొత్త కాలుష్య నివారణ నిబంధనల్ని వాహన తయారీ సంస్థలు కచ్చితంగా అమలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో త్వరలో కార్లు, వాణిజ్య వాహనాల ధరలు పెరిగే అవకాశం ఉంది. భారత్‌ స్టేజ్‌ VI రెండో దశ ప్రమాణాలకు అనుగుణంగా తయారీ సంస్థలు తమ వాహనాలను తయారు  చేయాల్సి ఉంది. దీనికోసం కంపెనీలు మరింత ఆధునిక విడిభాగాలను ఉపయోగించాల్సి ఉంటుంది. దీంతో మొత్తంగా ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. అందుకు అనుగుణంగా కంపెనీలు విక్రయ ధరల్ని పెంచుతాయని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.

వాహనాల నుంచి వెలువడే కాలుష్య కారకాల స్థాయిని ఎప్పటికప్పుడు గుర్తించే పరికరాలను కంపెనీలు అమర్చాల్సి ఉంటుంది. ఎప్పుడైతే నిర్ధిష్ట స్థాయిని దాటుతాయో వెంటనే హెచ్చరిక లైట్లు వెలిగి వాహనాన్ని సర్వీసుకు పంపాలని సూచిస్తాయి. అలాగే మండాల్సిన ఇంధన పరిమాణాన్ని కూడా నియంత్రించాల్సి ఉంటుంది. అందుకోసం ప్రత్యేకంగా ప్రోగ్రామింగ్‌ చేసిన ‘ఫ్యుయల్‌ ఇంజెక్టర్స్‌’ను అమర్చాలి. అలాగే వాహనంలో వాడే మరికొన్ని సెమీకండక్టర్లను కూడా అప్‌గ్రేడ్‌ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీంతో మొత్తంగా తయారీ వ్యయం పెరగనున్నట్లు అంచనా వేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని