TATA Motors: జనవరి నుంచి టాటా కార్ల ధరల పెంపు
వచ్చే నెల నుంచి కార్ల ధరలను పెంచే యోచనలో టాటా మోటార్స్ ఉంది. ఏప్రిల్ 2023 నుంచి కఠిన ఉద్గార నిబంధనలు అమల్లోకి రానున్న నేపథ్యంలో...
దిల్లీ: వచ్చే నెల నుంచి కార్ల ధరలను పెంచే యోచనలో టాటా మోటార్స్ ఉంది. ఏప్రిల్ 2023 నుంచి కఠిన ఉద్గార నిబంధనలు అమల్లోకి రానున్న నేపథ్యంలో, వాటికి తగ్గట్లుగా తన కార్ల మోడళ్లను అభివృద్ధి చేసేందుకు అయ్యే వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ధరలను పెంచుతున్నట్లు కంపెనీకి చెందిన ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. అలాగే కమొడిటీల అధిక ధరల ప్రభావాన్ని తగ్గించుకునేందుకు కూడా ఈ ధరల సవరణ ఉపయోగపడుతుందని పీటీఐ వార్తా సంస్థకు టాటా మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ (ప్రయాణికుల వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు) శైలేష్ చంద్ర తెలిపారు. మరోవైపు బ్యాటరీల ధరలు కూడా పెరిగాయని, ఇప్పటివరకు ఈ ప్రభావాన్ని కొనుగోలుదార్లకు బదిలీ చేయలేదనే విషయాన్ని ఆయన తెలిపారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొని ధరలను పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నామని వివరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Turkey- syria Earthquake: అద్భుతం.. మృత్యుంజయులుగా బయటకొచ్చిన చిన్నారులు
-
India News
Cheetah: అవి పెద్దయ్యాక మనల్ని తినేస్తాయి.. మన పార్టీ ఓట్లను తగ్గించేస్తాయి..
-
Sports News
IND vs AUS: మూడో స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌ని ఎంపిక చేయండి: రవిశాస్త్రి
-
Movies News
Kiara Sidharth Malhotra: ఒక్కటైన ప్రేమజంట.. ఘనంగా కియారా- సిద్ధార్థ్‌ల పరిణయం
-
Politics News
BJP: ప్రధాని మోదీపై రాహుల్ ఆరోపణలు నిరాధారం, సిగ్గుచేటు: రవిశంకర్ ప్రసాద్
-
World News
Turkey Earthquake: భూకంప విలయం.. రంగంలోకి శాటిలైట్లు!