Facebook: ఫేస్‌బుక్‌లో లింక్‌ హిస్టరీ.. ఈ ఫీచర్‌ ఎలా ఉపయోగపడుతుందంటే?

Facebook: ప్రముఖ సోషల్‌మీడియా సంస్థ ఫేస్‌బుక్‌ యాప్‌లో ‘లింక్‌ హిస్టరీ’ పేరుతో కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. దీన్ని ఎలా ఎనేబల్‌ చేసుకోవాలంటే..?

Published : 04 Jan 2024 02:24 IST

Facebook | ఇంటర్నెట్‌డెస్క్‌: ఫేస్‌బుక్‌ ఫీడ్‌ స్క్రోల్ చేస్తున్న సమయంలో అనేక వెబ్‌సైట్‌ లింక్‌లు దర్శనమిస్తాయి. ఉద్యోగం, వ్యాపారం అంటూ ఇలా కనిపించే వాటిలో మనకు నచ్చిన లింక్‌లను క్లిక్‌ చేస్తుంటాం. ఏదైనా అవసరం కొద్దీ పాత లింక్‌ను తిరిగి పొందాలంటే అసలు కుదరదు. ఎంత వెతికినా ఫీడ్‌లో కనిపించదు. ఈ ఇబ్బందులకు చెక్‌ పెడుతూ ఫేస్‌బుక్‌ కొత్త సదుపాయాన్ని తెచ్చింది. సందర్శించిన వెబ్‌సైట్ల వివరాలను పొందేందుకు లింక్‌ హిస్టరీ పేరిట కొత్త ఫీచర్‌ని తీసుకొచ్చింది.

గడిచిన 30 రోజుల్లో ఫేస్‌బుక్‌లో సందర్శించిన అన్ని వెబ్‌సైట్‌లను ట్రాక్ చేయటానికి ‘లింక్‌ హిస్టరీ’ ఫీచర్‌ ఉపయోగపడనుంది. ఐఫోన్‌, ఆండ్రాయిడ్‌ మొబైల్‌ యూజర్లకు ఇప్పటికే ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్‌ డీఫాల్ట్‌గా ఆన్‌లో ఉంటుంది. వద్దనుకుంటే ఆఫ్‌ చేయొచ్చు.

చమురు ధరల తగ్గింపుపై కేంద్రం క్లారిటీ

ఈ ఫీచర్‌ను ఎనేబుల్‌ చేసుకునేందుకు.. ఫేస్‌బుక్‌లో కనిపించే ఏదైనా లింక్‌పై క్లిక్‌ చేయండి. కుడివైపు పైన మూడు చుక్కలపై క్లిక్‌ చేసి ‘Browser settings’ని ఎంచుకోండి. తర్వాత కనిపించే ‘To turn link history on/off’  ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో మీకు నచ్చిన ఆప్షన్‌ ఎనేబుల్‌ చేసుకోవచ్చు. మూడు చుక్కల మెనూలో లింక్‌ హిస్టరీ ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తే.. గతంలో మీరు ఓపెన్‌ చేసిన వెబ్‌సైట్‌ లింకులు తేదీల వారీగా కనిపిస్తాయి. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్ మొబైల్‌ యాప్‌ యూజర్లకు లింక్ హిస్టరీ ఫీచర్‌ అందుబాటులో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని