Infinix Smart 8: భారత్‌లో ఇన్ఫీనిక్స్‌ స్మార్ట్‌ 8 ఫోన్‌ విడుదల.. ధర, ఫీచర్లివే!

Infinix Smart 8: ఇన్ఫీనిక్స్‌ స్మార్ట్‌ 8లో మీడియా టెక్‌ హీలియో జీ36 ప్రాసెసర్‌, 5000mAh బ్యాటరీని పొందుపర్చారు.

Updated : 15 Jan 2024 13:34 IST

Infinix Smart 8 | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇన్ఫీనిక్స్‌ నుంచి స్మార్ట్‌ 8 (Infinix Smart 8) అనే కొత్త ఫోన్‌ భారత్‌లో విడుదలైంది. గత ఏడాది నవంబర్‌లో నైజీరియా మార్కెట్‌లోకి ప్రవేశించిన ఈ ఫోన్‌ తాజాగా భారత యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. దీంట్లో మీడియా టెక్‌ హీలియో జీ36 ప్రాసెసర్‌ను ఇస్తున్నారు. 5000mAh బ్యాటరీని పొందుపర్చారు.

ఇన్ఫీనిక్స్‌ స్మార్ట్‌ 8 (Infinix Smart 8) భారత్‌లో 4జీబీ ర్యామ్‌ + 64 జీబీ స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది. దీని ధర రూ.7,499. ఫ్లిప్‌కార్ట్‌లో జనవరి 15 నుంచి విక్రయాలు ప్రారంభమయ్యాయి. లాంఛ్‌ ఆఫర్‌ కింద దీన్ని రూ.6,749కే అందిస్తున్నారు. గెలాక్సీ వైట్‌, రెయిన్‌బో బ్లూ, షైనీ గోల్డ్‌, టింబర్‌ బ్లాక్‌ రంగుల్లో ఈ ఫోన్‌ లభిస్తుంది.

90Hz రిఫ్రెష్‌ రేట్‌ ఉన్న 6.6 అంగుళాల హెచ్‌డీ+ తెరను ఇన్ఫీనిక్స్‌ స్మార్ట్‌ 8 (Infinix Smart 8) ఫోన్‌లో అమర్చారు. 12ఎన్‌ఎం ఆక్టాకోర్‌ మీడియా టెక్‌ హీలియో జీ36 ప్రాసెసర్‌ను ఇస్తున్నారు. 4జీబీ ర్యామ్‌ను వర్చువల్‌గా 8జీబీ వరకు విస్తరించుకోవచ్చు. స్టోరేజ్‌ను మైక్రోఎస్‌డీ కార్డ్‌తో 2 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ 13 గో ఎడిషన్‌ ఆధారిత ఎక్స్‌ఓఎస్‌13 ఓఎస్‌ను ఇచ్చారు.

ఇన్ఫీనిక్స్‌ స్మార్ట్‌ 8 (Infinix Smart 8)లో 50 మెగాపిక్సెల్‌ ప్రధాన కెమెరాను పొందుపర్చారు. సెల్ఫీల కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్‌ కెమెరా ఇచ్చారు. 4జీ ఎల్‌టీఈ, వైఫై, బ్లూటూత్‌ 5.0, జీపీఎస్‌, GLONASS, యూఎస్‌బీ టైప్‌-సి వంటి ఫీచర్లు ఉన్నాయి. పక్క భాగంలో ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని