Gold Loans: బంగారు రుణాలపై ఏ బ్యాంకులో ఎంత వడ్డీ..?

ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో బంగారంపై రుణాలు త్వరితంగా లభిస్తాయి. ఈ రుణాలపై వివిధ రుణ సంస్థలు విధించే వడ్డీ రేట్లు ఎంతెంత ఉన్నాయో ఇక్కడ చూద్దాం..

Published : 06 Feb 2023 15:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  వ్యక్తిగత రుణాలను చాలా మంది ఏదో సందర్భంలో తీసుకుంటుంటారు. వ్యక్తిగత అవసరాలకు, పిల్లల ఫీజులకు, వైద్య అవసరాల నిమిత్తం, వ్యాపార అవసరాలకు, మొదలైన వాటికి రుణాలు తీసుకోవడం ఎక్కువగా జరిగేదే. ఆర్థిక అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ఎలాంటి వారికైనా బంగారంపై రుణం వెంటనే లభిస్తుంది. ఇది సురక్షితమైన రుణం, బంగారం తాకట్టు పెట్టి ఈ రుణాలను తీసుకుంటే సరసమైన వడ్డీకే రుణాలు అందుబాటులో ఉంటాయి. క్రెడిట్‌ స్కోరును పరిగణనలోకి తీసుకోకుండానే బ్యాంకులు రుణాన్ని మంజూరు చేస్తాయి. భారత్‌లో బంగారంపై రుణాలను బ్యాంకులు, కొన్ని ఎన్‌బీఎఫ్‌సీలు చౌకైన వడ్డీ రేటుకే ఇస్తున్నాయి. 2 సంవత్సరాల కాలవ్యవధికి, రూ.2.50 లక్షల రుణంపై వివిధ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు కింది పట్టికలో ఉన్నాయి.

 

గమనిక: ఈ డేటా 2023 జనవరి 31 నాటిది. ఈ పట్టికలో తెలిపిన రుణం మొత్తం ఒక సూచిక మాత్రమే. ఇంకా అధిక మొత్తంలో కూడా రుణాన్ని తీసుకోవచ్చు. రుణ మొత్తం, వయసు, వివిధ పరిస్థితుల ఆధారంగా వడ్డీ రేట్లు మారొచ్చు. ప్రాసెసింగ్‌ రుసుములు, ఇతర ఛార్జీలు ఈఎంఐలో కలపలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని