iPhone 15 Series: ఐఫోన్‌ 15 సిరీస్‌లో టైప్‌-సి.. ఫాస్ట్‌ ఛార్జింగ్‌ కూడా?

iPhone 15 Series with Type-C port: ఐఫోన్‌ 15 సిరీస్‌ టైప్‌-సి పోర్ట్‌తో రానుంది. కొత్త మోడళ్లలో ఫాస్ట్‌ ఛార్జింగ్ సదుపాయం కూడా ఇవ్వబోతున్నారన్న వార్తలు వస్తున్నాయి.

Published : 18 Aug 2023 13:54 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ (Apple) త్వరలో ఐఫోన్‌ 15 (iphone 15) సిరీస్‌ ఫోన్లను లాంచ్‌ చేయనుంది. సెప్టెంబర్‌ 12న జరిగే ఈవెంట్‌లో వీటిని తీసుకొస్తారని సమాచారం. అయితే, గత కొన్నేళ్లుగా యాపిల్‌ తీసుకొస్తున్న ఫోన్లలో పెద్దగా మార్పులేమీ ఉండడం లేదన్న విమర్శ ఉంది. సాధారణంగా ఐఫోన్లలో లైటనింగ్‌ పోర్ట్‌ ఉంటుంది. అత్యవసర సమయంలో ఛార్జింగ్‌ పెట్టాలనుకునేటప్పుడు ఐఫోన్‌ యూజర్లకు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అలాగే, ఆండ్రాయిడ్‌ తరహాలో ఐఫోన్లలో ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయం కూడా ఉండడం లేదన్నది యూజర్ల నుంచి ఉన్న ఫిర్యాదుల్లో ఒకటి. వీటన్నింటికీ యాపిల్‌ తన 15 సిరీస్‌తో సమాధానం చెప్పలనుకుంటోందట.

అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్ల కోసం RBI కొత్త పోర్టల్.. వివరాలు ఇలా తెలుసుకోండి..

ఐఫోన్‌ 15 సిరీస్‌లో యాపిల్‌ ఐఫోన్‌ 15, ఐఫోన్‌ 15 ప్లస్‌, ఐఫోన్‌ 15 ప్రో, ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌ ఫోన్లను తీసుకురాబోతోంది. వచ్చే ఏడాది అమల్లోకి రానున్న ఈయూ రెగ్యులేషన్స్‌కు అనుగుణంగా టైప్‌-సి ఛార్జింగ్‌ సదుపాయంతోనే ఈ మోడళ్లను తీసుకురావాలనుకుంటోందని సంబంధిత వర్గాలు పేర్కొన్నట్లు తెలిసింది. అలాగే ఐఫోన్‌ 15 సిరీస్‌లో 35W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయం కూడా ఉండబోతోందట. అయితే, ఐఫోన్‌ 15 ప్రో, ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌ మోడళ్లకు మాత్రమే 35W ఫాస్ట్ ఛార్జింగ్‌ సదుపాయం తీసుకురానున్నారని సమాచారం. అయితే, యాపిల్‌ సర్టిఫై చేసిన కేబుళ్ల ద్వారా మాత్రమే ఫాస్ట్‌ ఛార్జింగ్‌ అయ్యేలా ఐఫోన్లను యాపిల్‌ ఆప్టిమైజ్‌ చేయబోతోందన్న ఊహాగానాలూ ఉన్నాయి. ఇక గతేడాది తీసుకొచ్చిన ఐఫోన్‌ 14 ప్రోలో 27W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను ఇచ్చారు. ఐఫోన్‌ 14లో 20W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయం ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని