LIC నుంచి న్యూ పెన్షన్‌ ప్లస్‌ ప్లాన్‌.. పూర్తి వివరాలు 10 పాయింట్లలో..

25 నుంచి 75 సంవ‌త్స‌రాల వ‌య‌సు వారికి పాల‌సీ తీసుకునేందుకు అర్హ‌త ఉంటుంది

Updated : 10 Sep 2022 17:15 IST

LIC new pension plus plan: భార‌తీయ అతిపెద్ద జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (LIC) కొత్త పెన్ష‌న్ ప్ల‌స్ ప్లాన్‌ను ప్రారంభించింది. ప‌ద‌వీ విర‌మ‌ణ జీవితం కోసం మ‌దుపు చేసే యువ‌త‌కు ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుంద‌ని సంస్థ తెలిపింది. 25 నుంచి 75 సంవ‌త్స‌రాల వ‌య‌సు గల వారికి పాల‌సీ తీసుకునేందుకు అర్హ‌త ఉంటుంది. సౌకర్యవంతమైన ప్రీమియం చెల్లింపులు, గ్యారెంటీడ్ అడిష‌న్స్‌, డిఫ‌ర్డ్ యాన్యుటీ, మార్కెట్ అనుసంధానిత చెల్లింపులు, పాక్షిక విత్‌డ్రా వంటి ఫీచ‌ర్లతో పాల‌సీ అందుబాటులో తీసుకొచ్చినట్లు  ఎల్ఐసీ తెలిపింది. ఆన్‌లైన్‌లో licindia.in ద్వారా గానీ, ఆఫ్‌లైన్‌లో ఏజెంట్లు, మ‌ధ్య‌వ‌ర్తుల ద్వారా గానీ పాల‌సీ కొనుగోలు చేయ‌వ‌చ్చు. ప్లాన్ నంబ‌రు 867. ప్రత్యేక గుర్తింపు సంఖ్య (UIN) 512L347V01. ఈ కొత్త పెన్ష‌న్ ప్లాన్ సెప్టెంబ‌రు 5 నుంచి అమ‌ల్లోకి వ‌చ్చింది.

ఎల్ఐసీ న్యూ పెన్ష‌న్ ప్ల‌స్ ప్లాన్ (LIC new pension plus plan) 10 ముఖ్య‌మైన పాయింట్లు..

  • సింగిల్ ప్రీమియం లేదా క్ర‌మానుగ‌త ప్రీమియం చెల్లింపుల విధానంలో త‌మ‌కు న‌చ్చిన విధానాన్ని ఎంచుకుని పాల‌సీని కొనుగోలు చేయ‌వ‌చ్చు. క్ర‌మానుగ‌త ప్రీమియం చెల్లింపుల‌ను ఎంచుకున్న వారు పాల‌సీ వ్య‌వ‌ధిలో స‌రైన స‌మ‌యానికి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
  • పాలసీదారులు చెల్లించాల్సిన ప్రీమియం అనేది.. పాల‌సీదారు వ‌య‌సు, పాల‌సీ కాల‌వ్య‌వ‌ధి, పాల‌సీదారు పెన్ష‌న్‌కు అర్హ‌త పొందే వ‌య‌సు త‌దిత‌ర అంశాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. పాల‌సీ క‌నిష్ఠ‌, గ‌రిష్ఠ ప‌రిమితుల‌కు లోబ‌డి పాల‌సీదారు చెల్లించాల్సిన‌ ప్రీమియంను ఎంపిక చేసుకోవ‌చ్చు.
  • ఇది పార్టిసిపేటింగ్, యూనిట్ లింక్డ్, వ్యక్తిగత పెన్షన్ ప్లాన్. క్రమబద్ధమైన, క్రమశిక్షణతో కూడిన పొదుపుతో పదవీ విరమణ నిధి స‌మ‌కూర్చుకునేందుకు సహాయపడుతుంది.
  • పాల‌సీ కాల‌వ్య‌వ‌ధి పూర్తి అయిన త‌ర్వాత యాన్యుటీ ప్లాన్‌ను కొనుగోలు చేయ‌డం ద్వారా క్ర‌మ‌మైన ఆదాయాన్ని పొంద‌వ‌చ్చు. 
  • ఇందులో నాలుగు ర‌కాల ఫండ్లు అందుబాటులో ఉంటాయి. ఎందులో పెట్టుబ‌డిపెట్టాలో పాల‌సీదారు అభీష్టంపై ఆధార‌ప‌డి ఉంటుంది. ఎంచుకున్న ఫండ్ 'ప్రీమియం ఎలోకేష‌న్ ఛార్జీ' ఆధారంగా ప్రీమియం మారుతుంది.
  • చెల్లించిన ప్రీమియం నుంచి ప్రీమియం ఎలోకేష‌న్ త‌దిత‌ర ఛార్జీల‌ను మిన‌హాయించి, మిగిలిన మొత్తాన్ని ఆయా ఫండ్ల‌లో మ‌దుపు చేస్తారు.
  • పాల‌సీదారునికి ఫండ్ల‌ను మార్చుకునే (ఛేంజ్ ఆఫ్ ఫండ్స్‌) ఆప్ష‌న్ కూడా అందుబాటులో ఉంది. ఒక పాల‌సీ సంవ‌త్స‌రంలో నాలుగు సార్లు ఈ అవ‌కాశం ఉంటుంది. 
  • క్రమానుగత ప్రీమియంలు చెల్లించేవారికి 5% నుంచి 15.5% వరకు, సింగిల్ ప్రీమియం చెల్లించేవారికి 5% గ్యారెంటీడ్ అడిష‌న్స్ ఆఫ‌ర్ చేస్తున్నారు.
  • ఈ రెండు సంద‌ర్భాల్లోనూ పాల‌సీ వ్య‌వ‌ధి పూర్తైన త‌ర్వాత మాత్ర‌మే ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. 
  • లైఫ్ అష్యూర్డ్ యాన్యుటైజేషన్ నిబంధన ప్రకారం పాలసీ టర్మ్ ముగిసే సమయం/సరెండర్/ నిలిపివేతపై పాలసీ ద్వారా వచ్చే ఆదాయాన్ని వినియోగించుకోవ‌చ్చు. 5 సంవత్సరాల తర్వాత యూనిట్ల పాక్షిక ఉపసంహరణకు అనుమ‌తిస్తారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని