Mahindra & Mahindra: మార్చిలో మహీంద్రా ఎస్‌యూవీ విక్రయాలు అదుర్స్‌

Mahindra & Mahindra: ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా (Mahindra & Mahindra) మార్చినెలలో అత్యధికంగా ఎస్‌యువీలను విక్రయించింది.

Published : 03 Apr 2023 21:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా (Mahindra & Mahindra) ఎస్‌యువీ సెగ్మెంట్‌లో తన సత్తా చాటింది. విక్రయాల్లో ఇంత వరకు ఎన్నడూ లేని విధంగా మెరుగైన వృద్ధిని నమోదు చేసింది. మార్చి నెలలో 35,976 యూనిట్ల ఎస్‌యూవీలు విక్రయించినట్లు తెలిపింది. అన్ని విభాగాల్లో ఏకంగా 66,091 యూనిట్ల వాహనాలు విక్రయాలు జరిగినట్లు ప్రకటించింది.

‘ఈ ఏడాది మార్చిలో ఎస్‌యూవీ విక్రయాల్లో 31 శాతం వృద్ధి నమోదుచేశాం. అన్ని సెగ్మెంట్లలో 60 శాతం వృద్ధి సాధించాం. కంపెనీ అభివృద్ధికి సహకరించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు’ అని ఎంఅండ్‌ఎం ఆటోమొబైల్‌ డివిజన్‌ ప్రెసిడెంట్‌ విజయ్‌నిక్రా తెలిపారు. కేవలం ఎస్‌యూవీలే కాదు.. మహీంద్రా XUV700, బొలెరో నియో, స్కార్పియో-ఎన్ (Scorpio-N) విక్రయాలు కూడా మార్చిలో పెరిగాయి. వీటి విక్రయాలు పెరగటం మహీంద్రా వృద్ధికి తోడైంది. 2020లో తమ ప్రతిష్ఠాత్మక థార్‌ మోడల్‌ని మహీంద్రా విడుదల చేసింది. మార్చిలో వీటి విక్రయాలు కూడా భారీగా పెరిగాయి.

విద్యుత్‌ కార్ల రంగంలో తన సత్తా చాటడానికి మహీంద్రా ప్రయత్నిస్తోంది. ఈ-కార్ల వ్యాపార విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. ఈ ఏడాదిలోనే మహీంద్రా కంపెనీ తన తొలి ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీని  భారత మార్కెట్లో విడుదల చేసింది. ఎక్స్‌యూవీ XUV400లో ఈవీ వెర్షన్‌ను తీసుకొచ్చింది. మొత్తం రెండు ట్రిమ్‌లలో ఇది అందుబాటులో ఉంది. వీటికి దాదాపు 18 నెలల వెయిటింగ్‌ పీరియడ్‌ ఉన్నట్లు కంపెనీ తెలిపింది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని