Maruti Suzuki: 9 వేల మారుతీ సుజుకీ కార్ల రీకాల్‌.. మోడళ్లు ఇవే..

ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ మారుతీ సుజుకీ (Maruti Suzuki) భారీ సంఖ్యలో కార్లను రీకాల్‌ (Recall) చేస్తోంది. సీటు బెల్టులోని (Seat belt) లోపాన్ని సవరించేందుకు వెనక్కి రప్పిస్తున్నట్లు తెలిపింది.

Published : 06 Dec 2022 19:55 IST

దిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ మారుతీ సుజుకీ  (Maruti Suzuki) భారీ సంఖ్యలో కార్లను రీకాల్‌ (Recall) చేస్తోంది. ముందు వరుసలోని సీటు బెల్టులో (Seat belt) లోపాన్ని సవరించేందుకు మొత్తం 9,125 కార్లను రీకాల్‌ చేస్తున్నట్లు ఆ కంపెనీ తెలిపింది. సియాజ్ (Ciaz)‌, బ్రెజా (Brezza), ఎర్టిగా (Ertiga), ఎక్స్‌ఎల్ 6 (XL6), గ్రాండ్‌ విటారా (Grand Vitara) వంటి మోడళ్లు రీకాల్‌ చేస్తున్న వాహనాల జాబితాలో ఉన్నాయి. 2022 నవంబర్‌ 2 నుంచి 28 మధ్య తయారైన వాహనాలను వెనక్కి రప్పిస్తున్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఆ కంపెనీ పేర్కొంది.

ముందు వరుస సీటు బెల్టులో ఎత్తును అడ్జెస్ట్‌ చేసే చోట లోపం ఉన్నట్లు అనుమానిస్తున్నామని, అలాగైతే సీటు బెల్టు విడిపోయే అవకాశం ఉన్నట్లు మారుతీ సుజుకీ తెలిపింది. రీకాల్‌ చేసిన వాహనాలను పరిశీలించి అవసరమైతే ఉచితంగానే సంబంధిత పార్టులను అమరుస్తామని తెలిపింది. ఆయా తేదీల్లో తయారైన వాహనాలను కొనుగోలు చేసిన వారికి వ్యక్తిగతంగా సమాచారం అందుతుందని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని