Tigor EV: మరింత రేంజ్‌ మరిన్ని సౌకర్యాలతో టాటా టిగోర్‌ EV

 మరింత రేంజ్‌, మరిన్ని సౌకర్యాలు జోడించిన కొత్త టిగోర్‌ ఈవీని టాటా మోటార్స్‌ విపణిలోకి విడుదల చేసింది.

Updated : 23 Nov 2022 15:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విద్యుత్‌ కార్ల విభాగంలో దూకుడుగా ముందుకెళ్తున్న టాటా మోటార్స్‌.. మరింత రేంజ్‌, మరిన్ని సౌకర్యాలు జోడించిన కొత్త టిగోర్‌ ఈవీని (Tigor.ev) విపణిలోకి విడుదల చేసింది. దీని ధరను రూ.12.49 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌)గా కంపెనీ నిర్ణయించింది. మొత్తం నాలుగు వేరియంట్లలో (XE, XT, XZ+, XZ+ LUX) ఈ కారు లభిస్తుంది.

ఇందులో 55 KW బ్యాటరీని అమర్చారు. దీని సాయంతో సింగిల్‌ ఛార్జ్‌తో 315 కిలోమీటర్ల రేంజ్‌ (ARAI ధ్రువీకరించిన) ప్రయాణించ వచ్చని కంపెనీ చెబుతోంది. దీంతో పాటు పలు స్మార్ట్‌ ఫీచర్లు ఇందులో కొత్తగా అందిస్తున్నారు. కనెక్టెడ్‌ కార్‌ టెక్నాలజీ- Z connect, స్మార్ట్‌వాచ్‌ కనెక్టివిటీ, ఆటో హెడ్‌ల్యాంప్స్‌, రెయిన్‌ సెన్సింగ్‌ వైపర్లు, టైర్‌ పంక్చర్‌ రిపేర్‌ కిట్‌ వంటివి ఇస్తున్నారు.

మరోవైపు టాటా మోటార్స్‌ టిగోర్‌ ఈవీని మూడు వేరియంట్లలో ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటి ధరల శ్రేణి రూ.11.99-13.14 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)గా నిర్ణయించింది. లాంచ్‌ చేసిన నెల రోజుల్లోనే 20 వేల బుకింగ్‌లు వచ్చినట్లు టాటా పాసింజర్‌ ఎలక్ట్రిక్‌ వాహన విభాగం మేనేజింగ్‌ డైరెక్టర్‌ శైలేష్‌ చంద్ర తెలిపారు. అలాగే పాత టిగోర్‌ ఈవీ వినియోగదారులకు త్వరలోనే సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ ద్వారా కొన్ని ముఖ్యమైన సదుపాయాలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు