యాడ్‌ బ్లాకర్‌ వాడుతున్నారా.. యూట్యూబ్‌ నిలిచిపోయే అవకాశం!

Youtube Ad blocker: యూట్యూబ్‌లో యాడ్స్‌ రాకుండా ఉండడానికి యాడ్‌ బ్లాకర్లు వాడుతున్నారా? అయితే, మీరు యూట్యూబ్ నిలిచిపోయే అవకాశం ఉంది. ఆ మేరకు యూట్యూబ్‌ చర్యలు ప్రారంభించింది.

Published : 30 Jun 2023 18:40 IST

ఇంటర్నెట్ డెస్క్: యూట్యూబ్‌ (Youtube) చూస్తున్నప్పుడు ఆరంభంలోనూ, మధ్యలో వచ్చే ప్రకటనలు మనల్ని చికాకు పెడుతుంటాయి. కొన్ని సార్లు ఆ యాడ్స్‌ను స్కిప్‌ కూడా చేయడానికి వీలు పడదు. దీంతో చాలా మంది ప్రకటనలు రాకుండా చేయడానికి యాడ్‌ బ్లాకర్లను (Ad Blockers) వాడుతుంటారు. ఒకవేళ మీరూ యాడ్‌ బ్లాకర్‌ వాడుతున్నారా? ఒకవేళ యూట్యూబ్‌ పంపించే హెచ్చరికలను పట్టించుకోకపోతే యూట్యూబ్‌ మిమ్మల్ని బ్లాక్‌ చేసే ప్రమాదముంది.

ఇటీవల కాలంలో ఆదాయాన్ని పెంచుకునేందుకు యూట్యూబ్‌ యాడ్స్‌ను పెంచింది. దీంతో చాలా మంది యాడ్‌ బ్లాకర్లను వాడడం మొదలుపెట్టారు. అలాంటి వారికి ఇటీవల కాలంలో యూట్యూబ్‌ ఓ వార్నింగ్‌ నోటిఫికేషన్‌ పంపుతోంది. ఒకవేళ యాడ్‌ బ్లాకర్‌ను డిజేబుల్‌ చేయకపోతే మూడు వీడియోల తర్వాత బ్లాక్‌ చేస్తామన్నది ఆ సందేశం సారాంశం. ఒకవేళ యాడ్స్‌ వద్దనుకుంటే ప్రీమియంకు సబ్‌స్క్రైబ్‌ అవ్వాలని యూట్యూబ్‌ సూచిస్తోంది.

‘‘యాడ్‌ బ్లాకర్లను వాడుతుంటే వాడొద్దని సూచిస్తూ పబ్లిషర్స్‌ అందరూ నోటిఫికేషన్‌ పంపించడం సర్వసాధారణంగా జరిగిదే. అయితే, ఒకవేళ తరచూ ఈ యాడ్స్‌ను ఉల్లంఘించడం పట్ల మేం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించాం. ఒకవేళ తప్పుగా ఎవరికైనా అలాంటి సందేశం వస్తే తమ దృష్టికి తీసుకురావాలి’’ అని యూట్యూబ్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు. యూట్యూబ్‌పై ఆధారపడి ఎంతోమంది క్రియేటర్లు ఉన్నారని, వారికి ప్రతిఫలం ఇవ్వాల్సి ఉంటుందని గుర్తుచేశారు. యాడ్స్‌ ద్వారా వచ్చిన సొమ్మే దీనికి ఆధారమని పేర్కొన్నారు. ఇప్పటికీ యూట్యూబ్‌ ఉచితంగానే లభిస్తోందని, ఒకవేళ యాడ్స్‌ లేకుండా సేవలు కావాలంటే ప్రీమియంకు సబ్‌స్క్రైబ్‌ అవ్వాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు