అందానికి బాదం నూనె..!

బాదం పప్పులు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే బాదం నూనెలో కూడా అందానికి మేలు చేసే గుణాలెన్నో ఉన్నాయి. ఇందులో ఉండే విటమిన్‌ ‘ఇ’, మోనోశ్యాచురేటెడ్‌ ఫ్యాటీ ఆమ్లాలు, మాంసకృత్తులు, పొటాషియం, జింక్‌.. వంటి పోషకాలు అందాన్ని ఇనుమడింపజేస్తాయి....

Published : 18 Aug 2023 14:17 IST

బాదం పప్పులు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే బాదం నూనెలో కూడా అందానికి మేలు చేసే గుణాలెన్నో ఉన్నాయి. ఇందులో ఉండే విటమిన్‌ ‘ఇ’, మోనోశ్యాచురేటెడ్‌ ఫ్యాటీ ఆమ్లాలు, మాంసకృత్తులు, పొటాషియం, జింక్‌.. వంటి పోషకాలు అందాన్ని ఇనుమడింపజేస్తాయి. మరి బాదం నూనె వల్ల కలిగే సౌందర్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం రండి...

జుట్టు చివర్లు చిట్లడం, పొడిబారడం వంటి సమస్యలు కొందరిని ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటప్పుడు బాదం నూనె, ఆముదం, ఆలివ్‌ నూనెల్ని సమపాళ్లలో తీసుకొని కలిపి.. ఈ మిశ్రమంతో కుదుళ్లను మర్దన చేసుకోవాలి. ఇలా కనీసం వారంలో రెండుసార్లు చేస్తే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.
స్నానం చేయడానికి ముందు శరీరానికి బాదం నూనె రాసుకొని బాగా మర్దన చేసుకోవాలి. ఇందులోని పోషకాలు చర్మానికి తేమనందిస్తాయి.

కళ్ల కింద నల్లటి వలయాలు ఇబ్బంది పెడుతున్నాయా..? అయితే రాత్రి పడుకునే ముందు కొన్ని చుక్కల బాదం నూనెను కళ్ల కింద అప్లై చేసుకొని మృదువుగా మర్దన చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తుంటే మార్పు కనిపిస్తుంది.
చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు ఇబ్బంది పెట్టే వారికి బాదం నూనె మేలు చేస్తుంది. ఇందులోని పోషకాలు యాంటీ ఏజింగ్‌ కారకాలుగా పనిచేస్తాయి. దీన్ని తరచూ రాసుకోవడం వల్ల ముడతలు కూడా మాయమవుతాయి.
దుమ్ము, ధూళి వంటివి చర్మాన్ని నిర్జీవంగా మారుస్తాయి. రెండు చెంచాల పెసరపిండిలో సరిపడా బాదం నూనె కలుపుకొని పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని చర్మానికి నలుగులా రాసుకుంటే మృతకణాలు తొలగిపోతాయి. చర్మం తాజాగా మారుతుంది.

బాదం నూనె సహజసిద్ధమైన సన్‌స్క్రీన్‌లా పనిచేస్తుంది. ఎండ వల్ల కమిలిన చర్మాన్ని సహజ రంగులోకి తీసుకొస్తుంది.
పొడిబారి గరుకుగా మారిన చర్మానికి, పగిలిన మడమలకు ఈ నూనెను పట్టించి బాగా మర్దన చేస్తే.. మార్పు కనిపిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్