రంగు తక్కువని వద్దన్నారు...

నా వయసు 24. మా బావని ఇష్టపడుతున్నాను. ఆ సంగతి మా ఇంట్లో చెబితే సంబంధం అడిగారు. కానీ నేను రంగు తక్కువని వాళ్లు ఒప్పుకోలేదు. దీంతో చాలా కుంగిపోతున్నాను. ఈ బాధ నుంచి ఎలా బయటపడాలి? సమాజంలో తెలుపు, ఎత్తు లాంటి విషయాల్లో కొన్ని భావాలు పాతుకుపోయాయి. అదే అందమనుకుంటారు. వీటిని ఒక్కసారిగా వదిలించుకోలేరు. మీకు అతను నచ్చాడే కానీ అతనికలాంటి ఆలోచన లేదేమో!...

Published : 02 May 2022 00:37 IST

నా వయసు 24. మా బావని ఇష్టపడుతున్నాను. ఆ సంగతి మా ఇంట్లో చెబితే సంబంధం అడిగారు. కానీ నేను రంగు తక్కువని వాళ్లు ఒప్పుకోలేదు. దీంతో చాలా కుంగిపోతున్నాను. ఈ బాధ నుంచి ఎలా బయటపడాలి?

- ఒక సోదరి


మాజంలో తెలుపు, ఎత్తు లాంటి విషయాల్లో కొన్ని భావాలు పాతుకుపోయాయి. అదే అందమనుకుంటారు. వీటిని ఒక్కసారిగా వదిలించుకోలేరు. మీకు అతను నచ్చాడే కానీ అతనికలాంటి ఆలోచన లేదేమో! ఎవరి ఇష్టాయిష్టాలు వారివి. శాస్త్రీయంగా మేనరికం మంచిది కాదని వద్దనుకున్నారేమో. రంగు కారణంగా ఇంట్లోవాళ్లు వ్యతిరేకత చూపినందువల్ల ఒప్పుకోలేదేమో! అలా చెప్పడం వల్ల మీకు బాధ కలిగింది. కనీసం ఆ విషయం మిమ్మల్ని నొప్పించకుండా చెప్పాల్సింది. వాళ్లకి తెలీని సంగతేమంటే రంగూ రూపం కంటే గుణం ప్రధానమని. భార్యాభర్తలకు ముఖ్యంగా కావలసింది అవగాహన, అర్థం చేసుకుని ప్రేమగా ఉండే తత్వం. స్వభావం కనుక మంచిది కాకపోతే జీవితాంతం బాధపడతారు. అది తెలియక మిమ్మల్ని బాధపెట్టారు. సహజంగా ఉన్న రంగు, రూపాలను మార్చలేం. మీరెలా ఉన్నా మిమ్మల్ని మీరు గౌరవించుకోవాలి. న్యూనత చెందాల్సిన పనిలేదు. అదసలు సమస్యే కాదు. లోకంలో అతనొక్కడే కాదు. రూపురేఖల కంటే మంచితనం, శక్తిసామర్థ్యాలను మెచ్చుకునే వారుంటారు. మీరు ఆత్మస్థైర్యంతో వృత్తిఉద్యోగాల్లో రాణిస్తూ హుషారుగా ఉండండి. పెళ్లిళ్లు, పండుగలూ లాంటి సందర్భాల్లో కలివిడిగా ఉండండి. మీ మనస్తత్వం, వ్యక్తిత్వం నచ్చి మీ కోసం వచ్చేవాళ్లు తప్పకుండా ఉంటారు. ఈలోపు పెళ్లి గురించి ఆలోచించకండి, అయినప్పుడే అవుతుందని స్థిమితంగా, సంతోషంగా ఉండండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని