Marital Life: దాంపత్యం ఆదర్శంగా సాగాలంటే...

భార్యాభర్తల అనుబంధం కలకాలం అనురాగంతో సాగిపోవాలంటే... నిజాయతీ మీతోడు కావాలి. పరిస్థితులను బట్టి సర్దుకుపోగలగాలి. ప్రేమించడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే సంతోషం మీ సొంతమవుతుంది.

Updated : 23 May 2021 12:07 IST

భార్యాభర్తల అనుబంధం కలకాలం అనురాగంతో సాగిపోవాలంటే... నిజాయతీ మీతోడు కావాలి. పరిస్థితులను బట్టి సర్దుకుపోగలగాలి. ప్రేమించడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే సంతోషం మీ సొంతమవుతుంది.
ఏ బంధంలో అయినా తాత్కాలికమైన, క్షణికమైన ఆవేశాలు, వాగ్వివాదాలు సహజమే. అలాగని వాటినే పట్టుకుని వేలాడొద్దు. సమస్య సద్దుమణిగాక వాస్తవంగా మిమ్మల్ని మీరు తరచి చూసుకోండి. అవతలివారి స్థానంలో మీరుంటే...ఏం చేస్తారో ఆలోచించండి. తర్వాత మీ తప్పు ఉన్నా...సరిదిద్దుకోవాల్సిన విషయం కనిపించినా వెనకడుగు వేయొద్దు. ఆ విషయం నిజాయతీగా ఒప్పుకొంటే...ఎంతటి పెద్ద చిక్కుముడైనా ఇట్టే వీడిపోతుంది.
* అంతేకాదు...భాగస్వామితో ఏదైనా విషయం చెప్పడానికి దాగుడు మూతలు ఆడుతుంటే ఎదుటివారిలో అభద్రత కనిపించొచ్చు. జీవిత భాగస్వామితో వీలైనంత పారదర్శకంగా ఉండాలి. అప్పుడే ఒకరిపై మరొకరికి గట్టి నమ్మకం ఏర్పడుతుంది.
* భార్యాభర్తల మధ్య శారీరకంగానే కాదు, మానసికంగానూ సాన్నిహిత్యం ఉండాలి. సమయం దొరికినప్పుడల్లా కలిసి కూర్చోవడం, ఇద్దరికీ ఆసక్తి ఉన్న అంశాలపై మాట్లాడుకోవడం.. ఇలాంటివన్నీ మీ అనుబంధాన్ని బలపరుస్తాయి.
* పెళ్లయ్యాక...భార్య/భర్తను ఆకట్టుకునే విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటారు. పెళ్లికాకముందు మీపై మీరెంత శ్రద్ధ చూపించారో...ఇప్పుడూ అదే చేయండి. ఏ విషయంలో అయినా భాగస్వామి మిమ్మల్ని విమర్శిస్తుంటే కుంగిపోనక్కర్లేదు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీ బలాల్ని పెంచుకోండి. ఇవన్నీ మీ బంధాన్ని చక్కబరిచేవే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్