close
గుస‌గుస‌లు
ఝాన్సీలక్ష్మీబాయిగా మారిందా?

దేశం గర్వపడే వీరనారీమణులు  రాణీ రుద్రమదేవి, ఝాన్సీలక్ష్మీబాయి. చరిత్రలో వీళ్లకున్న స్థానం సుస్థిరం. వీళ్ల కథలు వెండి తెరకూ ఎక్కాయి.  ‘రుద్రమదేవి’గా అనుష్క నటించి, ఆ పాత్రకు జీవం పోసింది. ఇప్పుడు ఝాన్సీలక్ష్మీబాయిగానూ మారిపోయింది. చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’లో అనుష్క పాత్ర అదేనట. ‘సైరా..’లో అనుష్క ఓ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. తను ఇందులో ఝాన్సీలక్ష్మీబాయిగా కనిపించనుందని సమాచారం. లక్ష్మీబాయికీ, ఉయ్యాలవాడ నరసింహారెడ్డికీ సంబంధమే లేదు. కానీ.. ఈ కథని ఝాన్సీలక్ష్మీబాయి కోణంలో చెప్పే ప్రయత్నం చేశారట దర్శకుడు సురేందర్‌రెడ్డి. అంటే అనుష్క కోణంలో ‘సైరా..’ కథ చెబుతున్నారన్నమాట. రామ్‌చరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో నయనతార, తమన్నా, అమితాబ్‌ బచ్చన్‌, జగపతిబాబు, సుదీప్‌, విజయ్‌సేతుపతి కీలక పాత్రధారులు. చిత్రీకరణ పూర్తయింది. అక్టోబరు 2న ఈ చిత్రం విడుదల కానుంది.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.