close
ఇంటర్వ్యూ
అడివి శేష్‌లో ఆ బలం ఉంది

ఒక్క నిర్మాత కూడా ఫోన్‌ చేయలేదు

‘ఎవరు’ దర్శకుడు రాంజీ

హైదరాబాద్‌: తొలి సినిమా ‘ఎవరు’తోనే దర్శకుడిగా హిట్‌ అందుకున్నారు వెంకట్‌ రాంజీ. ఆయన తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చి, మంచి టాక్‌ అందుకుంది. అడివి శేష్‌, రెజీనా, నవీన్‌ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఇది. పీవీపీ సినిమా సంస్థ నిర్మించింది. ఈ సినిమా విజయం అందుకున్న నేపథ్యంలో రాంజీ మీడియాతో మాట్లాడారు. ‘ఎవరు’ సినిమా గురించి ప్రస్తావించారు.

అప్పుడే నమ్మకం వచ్చింది
‘డిసెంబరులో ఈ సినిమా కట్‌ చూశాను. అప్పుడు ఇంకా 30 శాతం షూటింగ్‌ జరగాల్సి ఉంది. కట్‌ చూసినప్పుడే నాకు నమ్మకం వచ్చింది. నటీనటుల నటన చూసిన తర్వాత కిక్‌ వచ్చింది. ఈ విషయం శేష్‌, రెజీనా, నవీన్‌చంద్రలను కూడా చెప్పాను. ఈ సినిమాను నేను విడుదలకు ముందు ఎక్కువ సార్లు చూడలేదు. ఎందుకంటే అలా చూశానంటే నాకు ఎక్కువ తప్పులు కనిపిస్తాయి. మళ్లీ సమస్యలు వస్తాయి’.
సర్‌ప్రైజ్‌ అయ్యా
నా ఆలోచనలు క్లాస్‌గా ఉంటాయి. శేష్‌ కూడా ఇలానే ఆలోచిస్తుంటాడు. ‘ఎవరు’ సినిమాను కూడా క్లాస్‌గా తీశాం. కాబట్టి ఇది ఏ సెంటర్లలో బాగా ఆడుతుందని అనుకున్నాం. కానీ బీ, సీ సెంటర్లలో కూడా ఈ సినిమాను ప్రేక్షకులు విపరీతంగా చూడటంతో నేను సర్‌ప్రైజ్‌ అయ్యాను.

కిక్‌ వచ్చింది
‘నిన్న థియేటర్‌లో కూర్చుని సినిమా చూశా. ప్రేక్షకుల స్పందన చూసి, ఆశ్చర్యపోయా, పిచ్చ కిక్‌ వచ్చింది. ఈ సినిమాపై ముందు నుంచే మేం నమ్మకంతో ఉన్నాం. అందుకే ప్రీమియర్స్‌ వేశాం. తొలుత పీవీపీ గారు నాకు ఈ కథ పాయింట్‌ చెప్పారు. నాకు బాగా నచ్చింది. ఆ కథను థ్రిల్లర్‌ నేపథ్యంలో తీశాం. కథలో ఎమోషన్‌ ఉండాలి, దానికి ప్రేక్షకులు కనెక్ట్‌ అవ్వాలి అనేది నా అభిప్రాయం’.

రెజీనాకు ఆప్షన్‌ ఇవ్వలేదు
‘ఈ సినిమా గురించి పీవీపీ గారు రెజీనాకు ఫోన్‌ చేసి చెప్పారు. నేను కథ నరేట్‌ చేయడానికి వెళ్లాను. కథ చెప్తున్నప్పుడు ఆమె కళ్లతోనే నటించారు. ఆ పాత్రను నేను నరేట్‌ చేస్తున్నంత సేపు సీన్లకు తగ్గట్టు ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చారు. నరేషన్‌ పూర్తయిన తర్వాత.. ఆమెకు మాట్లాడే సమయం, ఆప్షన్‌ ఇవ్వలేదు. ‘మేడం మీకు కథ నచ్చిందా?’ అని అడిగాను. అనుకున్నట్లే రెజీనా ‘ఎవరు’లో అద్భుతంగా నటించారు. ప్రస్తుతం ఆమె సరైన స్క్రిప్టు కోసం ఎదురుచూస్తున్నారు. ‘అ!’ నుంచి ఆమె ప్రత్యేక పాత్రల్ని ఎంచుకుంటున్నారు. రెజీనా కళ్లతో అనేక భావాలు పలికిస్తారు. అదే ఈ సినిమాకు బలం చేకూర్చింది’.
నవీన్‌ చేస్తాడు అనుకోలేదు
‘అడివి శేష్‌ ‘క్షణం’ సినిమా నుంచి కొత్త ట్రెండ్‌ సృష్టించారు. ఈ సినిమా నుంచే చిన్న బడ్జెట్‌ సినిమాల్ని అందరూ గుర్తిస్తున్నారు. నవీన్‌ చంద్ర హీరోగా నటించారు. కాబట్టి ‘ఎవరు’ సినిమాలో నటిస్తాడని నేను ఊహించలేదు. కానీ ‘అరవింద సమేత’లోని పాత్ర చూసిన తర్వాత నిడివి తక్కువ ఉన్న పాత్రలు కూడా చేస్తున్నారని అర్థమైంది. అప్పుడే మెసేజ్‌ చేశాను. ‘ఇది నా కెరీర్‌కు ఉపయోగపడుతుంది’ అని ఆయన అన్నారు. నటించడానికి ఒప్పుకున్నారు’.

శేష్‌కు ఆ సత్తా ఉంది
‘శేష్‌కు ఓ వంద ఐడియాలు చెబితే.. సరైన ఐడియా ఇదని ఒక్కదాన్ని పైకి తీస్తాడు. అతడిలో ఆ సత్తా ఉంది. అలా శేష్‌ ‘ఎవరు’ కథకు నాకు సహాయం చేశారు. శేష్‌ కూర్చొని రాసే రచయిత కాదు.. కథ ఇలా ఉంటే బాగుంటుందని చెప్పే రచయిత’.
ఎవరూ ఫోన్‌ చేయలేదు
‘ఓ కథను సొంతంగా రాయడం సులభం. దాన్ని తెరపై చూపించడం కూడా సులభమే. కానీ ప్రేక్షకులకు తెలిసిన కథను మళ్లీ చూపించడం కష్టం. నా తర్వాతి సినిమా కూడా ‘ఎవరు’లా సస్సెన్స్‌ థ్రిల్లర్‌లానే ఉంటుంది. ఇలాంటి కథలే చేయాలి అనుకుంటున్నా. ఈ సినిమా తర్వాత నాకు ఒక్క నిర్మాత నుంచి కూడా ఫోన్‌ రాలేదు. బహుశా.. నా ఫోన్‌ నవంబర్‌ ఎవరికీ తెలియదు అనుకుంటా (నవ్వుతూ)’.

 

 



Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.