Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్లు.. టెంప్లెట్స్‌ 2.0తో రీల్స్‌ ఎడిటింగ్‌

ఫొటో/వీడియో షేరింగ్ యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram).. టెంప్లెట్స్‌ 2.0 పేరుతో రీల్స్‌ చేసే వారి కోసం కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. వీటితో యూజర్లు తమ రీల్స్‌ను మరింత మెరుగ్గా ఎడిట్‌ చేయొచ్చని తెలిపింది. 

Published : 19 Jul 2023 18:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ (Instagram Reels) చేసే వారి కోసం కొత్త ఫీచర్లను పరిచయం చేసినట్లు కంపెనీ హెడ్ ఆడమ్‌ మోస్సేరి వెల్లడించారు. ఇన్‌స్టాలోని రీల్స్ ఎడిటర్స్‌లో కొన్ని కొత్త టెంప్లెట్స్‌ను పరిచయం చేయడంతోపాటు, టెంప్లెట్స్‌ బ్రౌజర్‌ను అప్‌డేట్‌ చేసినట్లు తెలిపారు. వీటితో రీల్స్ ఎడిట్‌ చేసేవారు తమ వీడియోలను మరింత ఆకర్షణీయంగా ఎడిట్‌ చేయొచ్చు. 

‘‘ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ చేసే వారి కోసం టెంప్లెట్స్‌లో మ్యూజిక్‌, క్లిప్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వాటికి అదనంగా టెక్ట్స్, ట్రాన్సిషన్స్ (ఎడిటింగ్ ఎఫెక్ట్)ను తీసుకొచ్చాం. అలాగే, కొత్తగా మరికొన్ని ఏఆర్‌ (ఆగ్యుమెంటెడ్‌ రియాల్టీ) ఎఫెక్ట్స్‌ను పరిచయం చేశాం. వీటితోపాటు రీల్స్‌ ఎడిటర్‌లో టెంప్లెట్స్‌ బ్రౌజర్‌ను కూడా మెరుగుపరిచాం. దీంతో యూజర్లు ట్రెండింగ్‌లో ఉన్న టెంప్లెట్స్‌ను సులువుగా చూడొచ్చు. వీటిలో ఏవైనా టెంప్లెట్స్‌ నచ్చితే.. వాటిలో తమ రీల్‌కు తగినట్లుగా మార్పులు చేసుకుని ఉపయోగించుకోవచ్చు. దీన్ని మేం టెంప్లెట్స్‌ 2.0గా పిలుస్తున్నాం’’ అని ఆడమ్‌ వీడియోలో చెప్పారు. 

₹10వేలకే 108 MP కెమెరాతో రియల్‌మీ కొత్త ఫోన్‌

ఇన్‌స్టాగ్రామ్‌.. రీల్స్ టెంప్లెట్స్‌ ఫీచర్‌ను గతేడాది పరిచయం చేసింది. దీంతో యూజర్లు ఇతరులు చేసిన రీల్స్‌లో ఏవైనా నచ్చితే.. వాటిని తమకు నచ్చినట్లుగా ఎడిట్‌ చేసి ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం ఇతరులు చేసిన రీల్‌ చూస్తూ కెమెరా సింబల్‌పై క్లిక్ చేయాలి. తర్వాత నచ్చిన మ్యూజిక్‌, ఎఫెక్ట్స్‌తో ఫొటో/వీడియో యాడ్‌ చేసి అప్‌లోడ్‌పై క్లిక్ చేస్తే.. అదే టెంప్లేట్‌తో రీల్ పోస్ట్‌ అవుతుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని