Poco X6: పోకో ఎక్స్‌6లో కొత్త వేరియంట్‌.. ధర, ఫీచర్లివే..

Poco X6: నెల క్రితం పోకో ఎక్స్‌6 ఫోన్‌ భారత్‌లో విడుదలైంది. తాజాగా దీంట్లో మరో కొత్త వేరియంట్ వచ్చింది.

Updated : 13 Feb 2024 15:48 IST

Poco smart phones | ఇంటర్నెట్‌డెస్క్‌: చైనా మొబైల్ కంపెనీ షావోమీ సబ్‌బ్రాండ్‌ పోకో (Poco).. ఎక్స్‌6 స్మార్ట్‌ఫోన్‌లో (Poco X6) కొత్త వేరియంట్‌ను భారత్‌లో విడుదల చేసింది. నెల క్రితం 8జీబీ+256జీబీ, 12జీబీ+512జీబీ తీసుకురాగా.. తాజాగా 12జీబీ+256జీబీ వేరియంట్‌ను సైతం ప్రవేశపెట్టింది.

పోకో ఎక్స్‌6 (Poco X6) 12జీబీ+256జీబీ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 7ఎస్‌ జెన్‌2 ప్రాసెసర్‌తో వస్తోంది. 5,100mAh బ్యాటరీ, 167W ఫాస్ట్‌ ఛార్జింగ్ సదుపాయం ఉంది. 64 ఎంపీ ప్రధాన, 8ఎంపీ అల్ట్రా వైడ్‌, 2 ఎంపీ మాక్రో కెమెరాను ఇచ్చారు. సెల్ఫీ కోసం ముందు భాగంలో 16 ఎంపీ కెమెరా అమర్చారు. 120Hz స్క్రీన్‌ రిఫ్రెష్‌ రేటు, 1,800 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌తో 6.67 అంగుళాల తెరను ఇచ్చారు. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత హైపర్‌ఓస్‌కు నాలుగేళ్ల వరకు అప్‌డేట్లు ఇవ్వనున్నారు.

ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ విక్రయానికి అందుబాటులో ఉంది. దీని ధర రూ.23,999. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌ బ్యాంక్‌ కార్డులు లేదా ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే రూ.3,000 రాయితీ లభిస్తుంది. మిర్రర్ బ్లాక్‌, స్నోస్టోర్మ్‌ వైట్‌ రంగుల్లో ఈ ఫోన్‌ను పొందొచ్చు. గతంలో వచ్చిన 8జీబీ+256జీబీ, 12జీబీ+512జీబీ వేరియంట్ల ధర వరుసగా రూ.21,999, రూ.24,999గా ఉన్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని