PPF: ఒక కుటుంబంలో ఎన్ని పీపీఎఫ్ ఖాతాలు తెరవొచ్చు?
PPF details in telugu: ఒక వ్యక్తి ఎన్ని పీపీఎఫ్ ఖాతాలు తెరవచ్చు? భార్య, పిల్లల పేరుపై కూడా పీపీఎఫ్ ఖాతాలను తెరవొచ్చా? అన్ని ఖాతాలకు పన్ను మినహాయింపు లభిస్తుందా?
ఇంటర్నెట్ డెస్క్: పెట్టుబడులు సురక్షితంగా ఉండాలి.. ఏ మాత్రం నష్టభయం ఉండకూడదనుకునే వారికి పీపీఎఫ్ (PPF) ఒక మంచి మార్గం. పెట్టుబడులకు ప్రభుత్వ హామీ ఉండడంతో పాటు ఈఈఈ (EEE) కేటగిరీ కింద పన్ను ప్రయోజనాలు పొందొచ్చు. అంటే, పెట్టుబడులపై సెక్షన్ 80సి (80c) కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. అలాగే రాబడి, మెచ్యూరిటీ మొత్తంపై పన్ను వర్తించదు. అయితే ఒక వ్యక్తి ఎన్ని పీపీఎఫ్ ఖాతాలు తెరవచ్చు? భార్య, పిల్లల పేరుపై కూడా పీపీఎఫ్ ఖాతాలను తెరవొచ్చా? అన్ని ఖాతాలకూ పన్ను మినహాయింపు లభిస్తుందా?
ఎన్ని ఖాతాలు తెరవచ్చు?
ఒక వ్యక్తి పేరుపై ఒక పీపీఎఫ్ (PPF) ఖాతాను మాత్రమే తెరిచే వీలుంది. ఒకవేళ పొరపాటున ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు తెరిచినా రెండో ఖాతాను నిరుపయోగ ఖాతాగా పరిగణిస్తారు. ఆ ఖాతాలో జమ చేసిన మొత్తంపై వడ్డీ లభించదు. పీపీఎఫ్ ఖాతాలో ఒక వ్యక్తి గరిష్ఠంగా రూ. 1.50 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. అలాగే, పెట్టుబడులపై సెక్షన్ 80c కింద రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు.
భార్యాభర్తలిద్దరూ ఖాతాలను తెరవొచ్చా?
భార్యాభర్తలిద్దరూ సంపాదనపరులైతే ఎవరి పేరుపై వారు ఖాతాలను తెరవొచ్చు. అలాగే, పీపీఎఫ్ కింద లభించే ప్రయోజనాలను విడివిడిగా పొందొచ్చు. ఒకవేళ భార్య ఉద్యోగం చేయకపోతే.. అప్పుడు భార్యకు బదులు భర్త పెట్టుబడి పెట్టొచ్చు. అయితే పెట్టుబడులు భర్త ఆదాయం నుంచి చేస్తున్నారు కాబట్టి వడ్డీని భర్త ఆదాయానికి జోడిస్తారు. ఇలాంటి సందర్భాల్లో భార్యాభర్తలిద్దరి ఖాతాలో రూ. 1.50 లక్షల చొప్పున రూ. 3 లక్షల వరకు జమ చేసినా.. సెక్షన్ 80c కింద రూ. 1.50 లక్షల వరకు మాత్రమే మినహాయింపు లభిస్తుంది. అయితే రాబడి, మెచ్యూరిటీలపై పన్ను ఉండదు కాబట్టి భర్త ఆదాయానికి జోడించినా ఇబ్బంది ఉండదు.
పిల్లల పేరుపై ఖాతా..
- పిల్లల పేరుపై తల్లి లేదా తండ్రి పీపీఎఫ్ ఖాతాను తెరవొచ్చు. తల్లిదండ్రులు జీవించి ఉండగా.. వేరొకరు పిల్లల పేరుపై పీపీఎఫ్ ఖాతాను తెరిచే అనుమతిలేదు. తల్లిదండ్రులిద్దరూ లేకపోతే, చట్టబద్ధమైన గార్డియన్‌కు మాత్రమే పిల్లల పేరుపై పీపీఎఫ్ ఖాతాను తెరిచే అనుమతి ఉంటుంది.
- ఒకే మైనర్ పేరుపై తల్లిదండ్రులిద్దరూ ఖాతాలను తెరవకూడదు. ఒక మైనరు పేరుపై తల్లి లేదా తండ్రి ఒక్కరు మాత్రమే ఖాతాను తెరిచే వీలుంది. అయితే కాంట్రీబ్యూషన్ మాత్రం ఇద్దరూ చేయవచ్చు.
- ఒక వ్యక్తి తన పేరుతో తన పాప/బాబు పేరుతో ఖాతాను తెరిచి రెండు ఖాతాలకు కాంట్రీబ్యూట్ చేస్తున్నట్లయితే.. ఒక ఏడాదిలో రెండు ఖాతాల్లో చేసే మొత్తం పెట్టుబడులు రూ. 1.50 లక్షలకు మించకూడదు.
- ఒకవేళ పీపీఎఫ్ ఖాతా ఉన్న పిల్లవాడు మేజర్ అయితే, ఖాతాను మేజర్ అయిన పిల్లవాడి పేరుకు బదిలీ చేయాల్సి ఉంటుంది. ఆ ఖాతాను వ్యక్తిగత ఖాతాగా మారుస్తారు. సాధారణ పీఎఫ్ ఖాతాకు లభించే అన్ని ప్రయోజనాలు ఈ ఖాతాకు వర్తిస్తాయి. మేజర్ అయిన పిల్లవాడి ఖాతాకు అతని తరఫున తల్లిదండ్రులు కాంట్రీబ్యూట్ చేయవచ్చు. అయితే, ముందే చెప్పినట్లు పెట్టుబడులను పెట్టుబడిదారుని ఆదాయానికి చేర్చుతారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
ఆస్ట్రాజెనెకా టీకాతో గుండెపై దుష్ప్రభావాలు: ప్రముఖ హృద్రోగ నిపుణుడి వ్యాఖ్యలు
-
India News
NEET PG 2023: ఎంబీబీఎస్ అభ్యర్థులకు గుడ్న్యూస్.. నీట్ పీజీ పరీక్షకు ఇంటర్న్షిప్ కటాఫ్ గడువు పెంపు
-
Crime News
Aaftab: శ్రద్ధాను చంపి.. చికెన్ రోల్ తిన్నాడు
-
India News
రూ.50వేల చొప్పున తీసుకున్నారు.. భర్తల్ని వదిలేసి ప్రియుళ్లతో వెళ్లిపోయారు
-
Crime News
Crime News: మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ భార్య బలవన్మరణం
-
Politics News
Kotamreddy: అభిమానం ఉండాలి.. రూ.కోట్లుంటే గెలవలేరు: కోటంరెడ్డి