WhatsApp: వాట్సాప్‌ నుంచి మరో అద్భుత ఫీచర్‌

WhatsApp Channels: వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌ ప్రకటించింది. ఛానెల్స్‌ పేరిట ఓ బ్రాడ్‌కాస్ట్‌ సదుపాయాన్ని తీసుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది.

Published : 14 Sep 2023 01:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ మరో అద్భుతమైన ఫీచర్‌ను తీసుకొచ్చింది. బ్రాడ్‌కాస్ట్‌ తరహాలో వాట్సాప్‌ ఛానెల్స్‌ (WhatsApp Channels) సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఇదో వన్‌వే ఛానెల్‌ లాంటిది. దీంతో ఒకేసారి పెద్దసంఖ్యలో సందేశాలు పంపించొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వాట్సాప్‌ తెలిపింది. మీరు కోరుకున్న వ్యక్తులు, సంస్థల నుంచి కావాల్సిన అప్‌డేట్‌లను ఈ ఛానెల్స్‌ ద్వారా పొందొచ్చని పేర్కొంది.

బ్లూడార్ట్‌ కీలక నిర్ణయం.. ‘భారత్‌ డార్ట్‌’ పేరుతో ఆ సేవలు

ఇది సాధారణ చాట్‌లతో పోలిస్తే కాస్త మెరుగైనది. వ్యక్తులు, సంస్థలను ఫాలో అయ్యే వారి వివరాలు ఇతర ఫాలోవర్స్‌కు తెలియవు. అచ్చం బ్రాడ్‌కాస్ట్‌ టూల్‌లా ఇది పనిచేస్తుంది. ఈ ఛానెల్‌ అడ్మినిస్ట్రేటర్‌ తమ ఫాలోవర్లకు టెక్ట్స్‌, ఫొటోలు, వీడియోలు, స్టిక్కర్లు, పోల్స్‌ను పంపించుకోవచ్చు. ఇందుకోసం అప్‌డేట్స్‌ అనే ట్యాబ్‌ను వాట్సాప్‌ తీసుకొస్తోంది. ఇందులో స్టేటస్‌లతో పాటు, ఛానెళ్లకు సంబంధించిన సమాచారం కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసినట్లు ప్రకటించిన నేపథ్యంలో కొన్ని గంటల్లో అందరికీ ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని