ఆ సమయంలో ఏమివ్వాలి?

మా పాపకు నాలుగైదు నెలల కిందటే పీరియడ్స్‌ మొదలయ్యాయి. ఆ సమయంలో చాలా నీరసంగా ఉంటోంది. ఏమీ తినాలనిపించడం లేదంటోంది. తనకు శక్తినిచ్చేలా ఏ ఆహారం పెట్టాలి?  

Updated : 11 Dec 2021 06:06 IST

మా పాపకు నాలుగైదు నెలల కిందటే పీరియడ్స్‌ మొదలయ్యాయి. ఆ సమయంలో చాలా నీరసంగా ఉంటోంది. ఏమీ తినాలనిపించడం లేదంటోంది. తనకు శక్తినిచ్చేలా ఏ ఆహారం పెట్టాలి?  

- ఓ సోదరి

రుతుచక్రం మొదలైన అమ్మాయిల్లో జీవక్రియల్లో మార్పులు, హార్మోన్ల అసమతౌల్యం, రక్తహీనత, నీటి శాతం తగ్గడం.. లాంటివి కనిపిస్తాయి. కొందరిలో అలసట, కడుపు, నడుము నొప్పి వంటివీ ఉంటాయి. వీటన్నింటి వల్ల తెలియకుండానే చిరాకు ప్రదర్శిస్తారు. కాబట్టి తల్లిగా మీరు తనకు అండగా ఉండాలి. నొప్పి తీవ్రత, రక్తస్రావం ఎక్కువగా ఉంటే వైద్యులను సంప్రదించాలి. ఈ సమయంలో కొందరికి ఆహారం సహించదు. అలాంటప్పుడు పండ్ల రసాలు, సోయా, ఫ్లేవర్డ్‌ మిల్క్‌ వంటివి ఇవ్వండి. ఇవి శరీరంలో కోల్పోయిన నీటి శాతాన్ని భర్తీ చేస్తాయి. వీటిల్లో ఎక్కువ మొత్తంలో ఉండే కెలొరీలు శక్తినీ ఇస్తాయి. అలాగే నిమ్మరసం, తేనె కలిపిన నీళ్లు, కొబ్బరి నీళ్లు, వెజిటబుల్‌ సూప్స్‌నూ రెండు గంటలకోసారి ఇస్తుండాలి. ఎలక్ట్రాల్‌ పౌడర్‌/ఓఆర్‌ఎస్‌, రాగి జావ లాంటివీ ఇవ్వొచ్చు. వీటితోపాటు రోస్టెడ్‌ నట్స్‌, చిక్కీ, నువ్వులు, పల్లీ లడ్డూ లాంటివి ఇవ్వండి. ఆమెకు నచ్చిన ఆహారాన్ని పెట్టండి. ఒకేసారి ఎక్కువ మొత్తంలో కాకుండా కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తీసుకునేలా చూడండి. ఈ సమయంలో తేలికగా జీర్ణమయ్యే వాటికి ప్రాధాన్యమివ్వండి. కార్న్‌ ఫ్లేక్స్‌, రాగి ఫ్లేక్స్‌ అండ్‌ మిల్క్‌, ఎండు ఫలాలతో చేసిన ఫ్రూట్‌ బౌల్‌, డేట్స్‌, ఉడకబెట్టిన పల్లీలు, రాగి లడ్డూ, స్వీట్‌ కార్న్‌ తినమనొచ్చు. ఆహారం తీసుకోకపోతే ఇంకా నీరసించి పోతారు. కాబట్టి ఆ సమయంలోనే కాకుండా ప్రతిరోజూ మాంసకృత్తులు, బి-కాంప్లెక్స్‌ ఉండే పదార్థాలు అందించాలి. తరచూ హిమోగ్లోబిన్‌ చెక్‌ చేయించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్