Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119003527
            [news_title_telugu_html] => 

‘సొమ్ము’సిల్లిన పాక్‌.. యుద్ధానికి సిద్ధమేనా?

[news_title_telugu] => ‘సొమ్ము’సిల్లిన పాక్‌.. యుద్ధానికి సిద్ధమేనా? [news_title_english] => Pak economy witnesses record high fiscal deficit [news_short_description] => ‘అణుయుద్ధంమైనా రావొచ్చు’.. ‘అక్టోబర్‌లోనే యుద్ధం’.. ‘ఎంతకైనా తెగిస్తాం’.. ‘మీరు మొదలు పెడితే మేము ముగిస్తాం.’. ఇలా తలాతోకా లేని ప్రకటనలను పాకిస్థాన్‌ నేతలు ... [news_tags_keywords] => india, pak, kashmir [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-30 11:01:08 [news_isactive] => 1 [news_status] => 2 ) )
‘సొమ్ము’సిల్లిన పాక్‌.. యుద్ధానికి సిద్ధమేనా? - Pak economy witnesses record high fiscal deficit - EENADU
close

కథనాలు

‘సొమ్ము’సిల్లిన పాక్‌.. యుద్ధానికి సిద్ధమేనా?

 దాయాది దేశం ప్రకటనల వెనుక మర్మమిదేనా..

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యకం: ‘అణుయుద్ధమైనా రావొచ్చు’.. ‘అక్టోబర్‌లోనే యుద్ధం’.. ‘ఎంతకైనా తెగిస్తాం’.. ‘మీరు మొదలు పెడితే మేము ముగిస్తాం.’. ఇలా తలాతోకా లేని ప్రకటనలను పాకిస్థాన్‌ నేతలు చేస్తున్నారు. ఇదంతా పాక్‌ నిస్సహాయతను ప్రపంచానికి తెలియజేస్తోందే తప్ప.. భారత్‌ను భయపెట్టలేకపోతోంది. ఎందుకంటే చిన్న చిన్న ఇబ్బందులున్నా.. భారత్‌ ఆర్థికంగా అత్యున్నత స్థితిలో ఉంది.. పాక్‌ ఆర్థికంగా అత్యంత ఘోరమైన స్థితిలో ఉంది. దివాలా అంచులకు చేరి ఐఎంఎఫ్‌ దయతో కాలం వెళ్లదీస్తోంది.

భారత్‌ కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు  చేసినప్పటి నుంచి పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ సొంత దేశంలో ప్రతిపక్షాల సెగ తగిలి మాటలపై నియంత్రణ కోల్పోయారు. అణు యుద్ధం అని కొంత సేపు.. శాంతి కోరుకుంటున్నామని మరికొంత సేపు.. ఇలా ఏదేదో మాట్లాడుతున్నారు. ఎవరెవరికో ఫోన్లు చేస్తున్నారు.. ఇమ్రాన్‌ ఖానే అలా మాట్లాడుతుంటే ఇక ఆయన మంత్రివర్గ సహచరుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. మొన్ననే రషీద్‌ అనే ఓ మంత్రివర్యుడు అక్టోబర్‌లో యుద్ధం తప్పదని జోస్యం చెప్పాడు. భారత్‌ మాత్రం వీటిని పెద్దగా పట్టించుకోలేదు.

28ఏళ్లలో ఇదే ఘోరం..

పాక్‌ ఆర్థిక మంత్రిత్వ శాఖ దేశపరిస్థితిని వివరిస్తూ మంగళవారం వివరాలను విడుదల చేసింది. ఇమ్రాన్‌ ఖాన్‌ పాక్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ గణాంకాలను విడుదల చేశారు. గత ఏడాది ద్రవ్యలోటు రికార్డు స్థాయిలో 8.9శాతానికి చేరింది. ప్రభుత్వ రాబడి కంటే వ్యయం ఎక్కువగా ఉంటే.. ఆ తేడాను ద్రవ్యలోటు అంటారు. వ్యయాలు విపరీతంగా పెరిగిపోతుంటే.. రాబడి మాత్రం పెరగటం లేదని డాన్‌ పత్రిక పేర్కొంది. గత 28ఏళ్లలో ఇంత ద్రవ్యలోటు ఎన్నడూలేదు. అభివృద్ధి పనుల నిధుల్లో 45శాతం కోత విధించినా ఈ పరిస్థితి నెలకొనడం చూస్తుంటే పాక్‌ ఆర్థిక కష్టాలు ఎలా ఉన్నాయో అర్థమవుతోంది. ప్రభుత్వ ఆదాయం 11.6శాతం పడిపోయింది. దీనిపై ఆ దేశ మాజీ ఆర్థిక సలహాదారు అష్ఫక్‌ హసన్‌ ఖాన్‌ మాట్లాడుతూ ‘నా జీవితంలో ఇంత ద్రవ్యలోటును ఎప్పుడూ చూడలేదు’ అని పేర్కొన్నారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. 

ఖర్చుల కట్టడికి చాయ్‌, బిస్కెట్లకు కోత..!

పాక్‌ అధికార సమావేశాల్లో చాయ్‌, బిస్కెట్లు ఇవ్వొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చివరికి ఈ రకంగా కూడా ఖర్చులను తగ్గించుకోవాలని చూస్తోంది. దీంతోపాటు నిరర్థకంగా ఉన్న కొన్ని ఆస్తులను గత ఏడాది వేలం వేసింది. సాక్షాత్తు ఇమ్రాన్‌ ఖాన్‌ ఉండే పీఎంవోనే రూ.40లక్షల కరెంటు బిల్లు బకాయిలను కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉంది.

యుద్ధం అంత తేలిక కాదు..

పాక్‌ సైనిక బడ్జెట్‌ ఈ ఏడాది దాదాపు 17శాతం పెరిగింది. కానీ, భారత రక్షణ బడ్జెట్‌కు ఇది ఏ మాత్రం దరిదాపుల్లోకి కూడా రాదు. యుద్ధం అంటే ఖర్చు భారీగా ఉంటుంది. దళాలను వ్యూహాత్మక ప్రాంతాలకు తరలించాలి. దీనికి భారీగా ఖర్చవుతుంది. ఇప్పుడున్న ఆయుధాలకు అవసరమైన మందు గుండు నిరంతరాయంగా సరఫరా చేసేలా కంపెనీలకు ఆర్డర్లు ఇవ్వాలి. ఇక విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే సవాలక్ష ఆంక్షలు ఉంటాయి. దీనికి డబ్బును ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది. పాక్‌ మిత్రదేశాల్లో ఈ స్థాయిలో మందుగుండు సరఫరా చేయగలిగిన దేశం ఒక్క చైనానే. కానీ, చైనా వ్యాపారానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది. భారత్‌తో ఆ దేశానికి వచ్చిన మిగులు ఆదాయం 57 బిలియన్‌ డాలర్లు .. ఇక పాక్‌తో వ్యాపారం కారణంగా మిగులు ఆదాయం 10 బిలియన్‌ డాలర్లు. వాణిజ్య యుద్ధంతో విలవిల్లాడుతున్న చైనా ఇప్పుడు కొత్తగా భారత్‌తో వైరం పెంచుకొని ఆదాయాన్ని పోగొట్టుకోదు.  భారత్‌తో బేరాలాడి లబ్ధిపొందడానికి పాకిస్థాన్‌ను ఒక పావుగా  మాత్రమే వాడుకొంటుంది. మరోపక్క అణ్వాయుధాల నిర్వహణ చాలా ఖర్చుతో కూడుకున్నది. భద్రత, తయారీ, మెటీరియల్‌, తరలింపు, అణు క్షిపణుల నిర్వహణ కోసమే భారీగా వెచ్చించాల్సి ఉంటుంది. ఇది పాక్‌ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీనికి తోడు పాక్‌ సైన్యంలో అవినీతికి అంతం లేదు. ఆ దేశ సైనిక బడ్జెట్‌లో సింహభాగం అణ్వాయుధాల నిర్వహణకే వెళ్లి పోతుంది. ఈ నేపథ్యంలో భారత్‌తో ప్రత్యక్ష యుద్ధం అంటే పాక్‌కు ఆత్మహత్యతో సమానం.
భారత జీడీపీ  2.7 ట్రిలియన్‌ డాలర్ల వద్ద ఉంటే పాక్‌ ఆర్థిక జీడీపీ 250 బిలియన్‌ డాలర్లు మాత్రమే ఉంది. పాక్‌ కంటే భారత్‌ ఆర్థిక వ్యవస్థ దాదాపు 11 రెట్లు పెద్దది.  ఇప్పటికే పాక్‌ బయట దేశాలకు చెల్లించాల్సిన మొత్తం 85 బిలియన్‌ డాలర్లను దాటిపోయింది. ఈ దశలో యుద్ధానికి దిగితే పాక్‌కు ప్రపంచంలో అప్పుపుట్టే అవకాశమే లేదు. ఇదంతా ఆ దేశాన్ని ఆర్థికంగా భూస్థాపితం చేస్తుంది. 

భారత్‌ సిద్ధంగా ఉందా..

భారత్‌ ఇప్పటికే ‘కోల్డ్‌ స్టార్ట్‌’ వ్యూహం అమలుకు సిద్ధంగా ఉంది. అంటే ఒక్కసారిగా శత్రువు తేరుకునేలోపు దాడిచేసి కొంత భూభాగాన్ని ఆక్రమించడం అన్నమాట. ఇప్పటికే భారత్‌కు చెందిన కీలక బలగాలు ఆర్టికల్‌ 370 రద్దు నాటికే సరిహద్దులకు అత్యంత సమీపంలో సిద్ధంగా ఉన్నాయి. దీనికితోడు సరిహద్దుల మధ్య వాణిజ్యాన్ని భారత్‌ పూర్తిగా నిలిపివేసింది. దీంతో ఈ మార్గంలో ఉగ్రమూక భారత్‌లోకి వచ్చేందుకు అవకాశం లేదు. కశ్మీర్‌లో అల్లర్లు సృష్టించి కొన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోతే వాటిని చూపి స్థానికులను ఇంకా ఎగదోయవచ్చనే పాక్‌ వ్యూహానికి భారత్‌ ఆంక్షల రూపంలో ముందే చెక్‌పెట్టింది.  ఇక పాక్‌ ముందున్నది ఒక్కటే మార్గం.. అంతర్జాతీయ సమాజాన్ని ఈ వ్యవహారంలోకి లాగాలి.  అందు కోసం దౌత్యమార్గంలో ఇమ్రాన్‌ ఖాన్‌ చేసిన యత్నాలు ఇప్పటికే నీరుగారిపోయాయి. దీంతో ఇప్పుడు అణు యుద్ధం అంటే ప్రపంచ దేశాలు బెదిరిపోయి చర్చల కోసం భారత్‌పై ఒత్తిడి తెస్తాయన్నది పాక్‌ వ్యూహం. ఉగ్రవాదం విషయంలో గుర్రుగా ఉన్న అగ్రరాజ్యాల చేతిలో మొట్టికాయలు పడే అవకాశం ఉంది.  కాగితాల మీద బలాబలాలను పక్కనపెట్టినా.. గతంలో జరిగిన నాలుగు యుద్ధాల్లో పాక్‌ భారత్‌ ఎదుట నిలవలేకపోయింది. ఇప్పుడు అదే పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని ఒక సారి పాక్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫే అంగీకరించారు. ఇటీవల ప్రతిపక్ష నేత బిలావల్‌ భుట్టో కూడా ‘మనం శ్రీనగర్‌ను వదిలిపెట్టి ముజఫరాబాద్‌ను కాపాడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది’ అనడం వెనుక అర్థం ఇదే.  యుద్ధం జరిగిన ప్రతిసారీ ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అంతకంతకు పతనం అయింది. ఈ చేదు నిజాలు పాక్‌ సైన్యానికి బాగా తెలుసు.  అందుకే ఇన్నేళ్లు పరోక్ష యుద్ధానికే పరిమితం అయింది. ఇక ముందు కూడా అంతే కావచ్చేమో కానీ, ప్రత్యక్ష యుద్ధానికి దిగే సాహసం చేయదు.


కథనాలు

మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.