close
బాలీవుడ్
బ్రేకింగ్‌ న్యూస్‌ కొట్టుకున్న అక్షయ్‌.. రోహిత్‌

ప్రముఖ బాలీవుడ్‌ కథానాయకుడు అక్షయ్‌ కుమార్‌, ప్రముఖ దర్శకుడు రోహిత్‌శెట్టి మధ్య ‘సూర్యవంశీ’ సెట్లో పెద్ద గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించారు. ఈ ఇద్దరినీ ఆపడానికి ఆఖరుకి పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. అంత కొట్టుకొనేంత గొడవ ఇద్దరి మధ్య ఏం జరిగింది? అంటే ఏమీ జరగలేదు. ఇదంతా ఓ గాసిప్‌ న్యూస్‌కి అక్షయ్‌, రోహిత్‌ ఇచ్చిన కౌంటర్‌. ఈ మధ్య ఓ బాలీవుడ్‌ వెబ్‌సైట్‌లో అక్షయ్‌ - రోహిత్‌ మధ్య మనస్పర్థలు వచ్చాయని, కరణ్‌జోహార్‌ మధ్యవర్తిగా వ్యవహరించి వాటిని  సరిదిద్దారంటూ వార్త వచ్చింది. దీనికి కౌంటర్‌గా అక్షయ్‌, రోహిత్‌ సెట్లో గొడవపడుతూ కొట్టుకుంటున్నట్టు ఓ వీడియోని చిత్రీకరించారు. ‘బ్రేకింగ్‌ న్యూస్‌...అక్షయ్‌, రోహిత్‌ మధ్య గొడవను లైవ్‌లో చూడండి’ అంటూ కత్రినాకైఫ్‌ మాటలతో మొదలయ్యే ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు అక్షయ్‌, రోహిత్‌. సరదాగా ఓ వీడియో చేసి భలే కౌంటర్‌ ఇచ్చారంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.

 



Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.