Amazon sale: అమెజాన్‌ ప్రైమ్‌డే సేల్‌లో ఈ ఫోన్లపై డిస్కౌంట్స్‌!

Amazon Prime Day Sale: అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌ ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించనున్నారు. కొన్ని పాపులర్‌ ఫోన్లపై భారీ డిస్కౌంట్స్‌ లభించనున్నాయి.

Published : 05 Jul 2023 01:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌కు (Amazon Prime Day Sale) సిద్ధమవుతోంది. ప్రైమ్‌ మెంబర్ల కోసం ఎక్స్‌క్లూజివ్‌గా జులై 15, 16 తేదీల్లో నిర్వహిస్తున్న ఈ సేల్‌లో పలు ఉత్పత్తులపై డిస్కౌంట్లు అందించనున్నారు. ఈ సేల్‌లో పలు ఫోన్లపైనా భారీ డిస్కౌంట్లు లభించబోతున్నాయి. ఐఫోన్‌తో పాటు రియల్‌మీ, వన్‌ప్లస్‌, రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లు ఉండబోతున్నాయి. ఐసీఐసీఐ, ఎస్‌బీఐ బ్యాంక్‌ కార్డుదారులకు ఈ సేల్‌లో 10 శాతం డిస్కౌంట్‌ లభించనుంది.

రియల్‌మీ నార్జో ఎన్‌ 53 ఫోన్‌పై ఈ సేల్‌లో డిస్కౌంట్‌ లభించనుంది. దీని ఎమ్మార్పీ రూ.10,999 కాగా.. ప్రస్తుతం 8,999కి విక్రయిస్తున్నారు. సేల్‌లో దీన్ని మరింత తక్కువకు విక్రయించనున్నారు. అలాగే, వన్‌ప్లస్‌ సీఈ3 లైట్‌ ఫోన్‌ను ప్రస్తుతం అమెజాన్‌లో రూ.19,999కు విక్రయిస్తున్నారు. దీనిపై డిస్కౌంట్‌ అందించనున్నారు. దీంతో పాటు బ్యాంక్‌ ఆఫర్‌, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో కొనుగోలు చేస్తే మరింత తక్కువకు లభించే అవకాశం ఉంది.

రెడ్‌మీ కే50ఐ 5జీ ఫోన్‌ను ప్రస్తుతం రూ.23,999కి విక్రయిస్తున్నారు. సేల్‌ సమయంలో ఈ ఫోన్‌పై రూ.2వేల వరకు డిస్కౌంట్‌ లభించే అవకాశం ఉంది. బ్యాంక్‌ డిస్కౌంట్‌ దీనికి అదనం. ఐకూ 11 ధర ప్రస్తుతం అమెజాన్‌లో రూ.54,999గా ఉంది. దీన్ని రూ.49వేలకే విక్రయించే అవకాశం ఉంది. ఇక ఐఫోన్‌ ప్రియుల కోసం ఐఫోన్‌ 14ను భారీ డిస్కౌంట్‌పై విక్రయించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఐఫోన్‌ 14 బేస్‌ వేరియంట్‌ ధర రూ.66,999గా ఉంది. సేల్‌ సమయంలో రూ.60వేలకే విక్రయించే అవకాశం ఉంది. ఒకవేళ ఐఫోన్‌ కోసం చూస్తుంటే ఇదే సరైన అవకాశం.

కేవలం స్మార్ట్‌ఫోన్లే కాదు.. అమెజాన్‌ బ్రాండ్‌ వస్తువులైన అమెజాన్‌ ఫైర్‌ స్టిక్‌, ఎకో డాట్‌ వంటివాటిపైనా ఈ సేల్‌లో భారీ డిస్కౌంట్‌ లభించనుంది. ఎకో డాట్‌ రూ.2,399కే విక్రయించనున్నారు. ఫైర్‌స్టిక్‌ను రూ.2,199కే విక్రయానికి ఉంచుతుండగా.. కిండ్లీ 4జీ రూ.7,999కే విక్రయించనున్నారు. కొన్ని వస్తువుల ధరలను ఇప్పటికే అమెజాన్‌ రివీల్ చేసినప్పటికీ.. కొన్ని వస్తువుల ధరలను ఇంకా ప్రకటించాల్సి ఉంది. సేల్‌ తేదీలు దగ్గరపడ్డాక ఆయా ధరలు బయటకు రానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని