Ather 450 Apex: ఏథర్‌ నుంచి కొత్త స్కూటర్‌.. సింగిల్‌ ఛార్జ్‌తో 157 km

Ather 450 Apex details: ఏథర్‌ కొత్త 450 అపెక్స్‌ను లాంచ్‌ చేసింది. ఇది సింగిల్ ఛార్జ్‌తో 157 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ధర రూ.1.89 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.

Published : 06 Jan 2024 16:17 IST

Ather 450 Apex | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ విద్యుత్‌ వాహనాల తయారీ సంస్థ ఏథర్‌ (Ather) నుంచి మరో కొత్త స్కూటర్‌ విడుదలైంది. ఎప్పటి నుంచో టీజర్లతో ఊరిస్తూ వస్తున్న ఏథర్‌ 450 అపెక్స్‌ (Ather 450 Apex)ను ఆ సంస్థ శనివారం లాంచ్‌ చేసింది. దీని ధర రూ.1.89 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్‌) కంపెనీ నిర్ణయించింది. ఏథర్‌ ప్రస్తుతం 450 ఎస్‌, 450 ఎక్స్‌ పేరిట రెండు మోడళ్లను విక్రయిస్తోంది. వాటితో పోలిస్తే కొత్త స్కూటర్‌లో అదనంగా ఏమేం తీసుకొచ్చారు? కొత్త స్కూటర్‌ విశేషాలు ఇప్పుడు చూద్దాం..

ఏథర్‌ కొత్త స్కూటర్‌లో 3.7kWh బ్యాటరీ ఇచ్చారు. ఇది సింగిల్‌ ఛార్జితో 157 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది. ఇందులో మొత్తం ఐదు రైడింగ్‌ మోడ్‌లు ఇచ్చారు. వ్రాప్‌ మోడ్‌ స్థానంలో కొత్తగా వ్రాప్‌ ప్లస్‌ను పరిచయం చేశారు. అలాగే మ్యాజిక్‌ ట్విస్ట్‌ అనే ఫీచర్‌ను తీసుకొచ్చారు. సాధారణంగా బ్రేక్‌ వేసేటప్పుడు థ్రోటల్‌ రిలీజ్‌ చేస్తూ.. బ్రేక్‌ అప్లయ్‌ చేస్తుంటాం. ఈ కొత్త ఫీచర్‌లో థ్రోటల్‌ రిలీజ్‌ చేసిన ప్రతిసారీ బ్రేక్‌ వేయాల్సిన అవసరం ఉండదు. ఆటోమేటిక్‌గా బ్రేక్‌ అప్లయ్‌ అవుతుంది. 

ఆ అకౌంట్లపై మినిమమ్‌ బ్యాలెన్స్‌ ఛార్జీలొద్దు.. బ్యాంకులకు RBI ఆదేశం

ఈ స్కూటర్‌ 2.09 సెకన్లలోనే 0-40 kmph వేగాన్ని అందుకుంటుంది. గరిష్ఠంగా 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఏథర్‌ 450 అపెక్స్‌ను ఇడియమ్‌ బ్లూ రంగులో తీసుకొచ్చారు. ఇది ఐదేళ్లు/ 60వేల కిలోమీటర్ల బ్యాటరీ వారెంటీతో వస్తోంది. 450ఎక్స్‌తో పోలిస్తే హార్డ్‌వేర్‌ పరంగా ఇతర మార్పులేవీ చేయలేదు. ఈ స్కూటర్‌ బుకింగ్స్‌ గత నెల నుంచే ప్రారంభమయ్యాయి. రూ.2500 చెల్లించి స్కూటర్‌ను బుక్‌ చేసుకోవచ్చు. మార్చి నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని