పాప స్నేహితులతో చిరాకేస్తోంది...

మునుపు మా పాప చాలా నెమ్మదిగా ఉండేది. ఈమధ్య ఫ్రెండ్స్‌తో కబుర్లు ఎక్కువయ్యాక ఎదురుచెబుతోంది. స్నేహితులను బట్టి మన ప్రవర్తన ఉంటుంది కదా! చాలా చిరాకేస్తోంది...

Published : 08 Sep 2021 01:25 IST

మునుపు మా పాప చాలా నెమ్మదిగా ఉండేది. ఈమధ్య ఫ్రెండ్స్‌తో కబుర్లు ఎక్కువయ్యాక ఎదురుచెబుతోంది. స్నేహితులను బట్టి మన ప్రవర్తన ఉంటుంది కదా! చాలా చిరాకేస్తోంది...

- ఒక సోదరి, కాకినాడ

టీనేజ్‌లో వచ్చే మార్పులవల్ల వాదనలు, మొండితనాలు సహజం. పెద్దలకి ఇదంతా స్నేహితుల ప్రభావం అనిపిస్తుంది. పిల్లలు- తోటివాళ్లలా ఉండటానికి ప్రయత్నిస్తారు. లేదంటే వాళ్లలో కలుపుకోరు. ఎంత బుద్ధిమంతులైన పిల్లలకైనా స్నేహితులు ఉండాల్సిందే! వాళ్ల నుంచి తాను నేర్చుకోవడం, తనకు తెలిసింది చర్చించడం వల్ల మీ అమ్మాయి ఆలోచనల్లో మార్పు వచ్చి ఉంటుంది. పిల్లలు చెడు నేర్చుకుంటున్నారనే భయంతో ఆంక్షలు విధిస్తారు. దాంతో తమ ఫ్రెండ్స్‌ దూరమవుతారేమోనని పిల్లలు అమ్మానాన్నల్నే తప్పుపట్టి వ్యతిరేకత పెంచుకుంటారు. అందువల్ల మిత్రుల గురించి కాకుండా ఆమె ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారో చెప్పండి. మన పిల్లలు మంచివాళ్లు, స్నేహితుల వల్ల మారిపోయారనడం అపోహ. మంచీచెడులేంటో వాళ్లు గ్రహించగలరు. మనం పదేపదే చెబుతుంటే విసుగొచ్చి ఎదురుచెబుతారు. నిజానికి స్నేహితులతో మెలగడంవల్ల లోకం పోకడ తెలుస్తుంది. స్నేహితులతో కలవొద్దని కాకుండా దేనివల్ల ఏమవుతుందో ఉదాహరణలు చెప్పండి. వీలైతే మీకు నచ్చినవాళ్లతో స్నేహం కుదిరేలా చూడండి. కథల పుస్తకాలు చదివించండి. మీ మాట వినకపోతే మేనత్త, పెదనాన్న లేదా టీచర్లు ఇలా ఆమె ఇష్టపడే వారితో చెప్పించండి. అదీ సందర్భవశాత్తూ చెబుతున్నట్లుండాలి. ఏది మంచిది, ఏది కాదు, ఎలా ఉంటే పైకొస్తారన్నవి తెలియజెప్పాలి. దీనితోబాటు హాబీలను ప్రోత్సహిస్తే మీమీద ప్రేమ పెరగడమే కాదు, స్నేహితులతో గడిపే సమయం తగ్గుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్