Published : 04/04/2021 02:54 IST

ఆదర్శవంతురాలు... ఈ దివ్యాంగురాలు

తను నడవలేదు... ఎవరైనా ఎత్తుకుని తీసుకువెళ్లాలి లేదా చక్రాల కుర్చీలో కూర్చోబెట్టుకుని సాయం ఉండాలి. అలాంటి ఓ వృద్ధ దివ్యాంగురాలు ఏకంగా 16 మంది వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తోంది. మరెందరో అన్నార్తుల ఆకలి తీరుస్తోంది. సాయం చేయాలనే మనసు ఉండాలే కానీ వృద్ధాప్యం, వైకల్యం అడ్డు రాదని నిరూపిస్తోంది అనంతపురం జిల్లాకి చెందిన 70 ఏళ్ల తియ్యకూర రత్నమ్మ.
త్నమ్మకు కాళ్లు సరిగా సహకరించవు. అయితేనేం... కొన్నేళ్లుగా ఎందరో అన్నార్థుల ఆకలి తీరుస్తోంది. ఆమె శరీరానికే వైకల్యం ఉందిగానీ... మనసుకు ఏమాత్రంలేదని నిరూపిస్తోంది. నాలుగు రోజులకోసారి కర్నూలుతోపాటు అనంతపురం జిల్లాలోని తాడిపత్రి వరకూ వెళ్లి బియ్యాన్ని సేకరిస్తుంది. వాటిని మహానంది పుణ్యక్షేత్రం - బోయిల కుంట్లమెట్ట మధ్యలోని నల్లమల అడవిదారిలో రాకపోకలు సాగించే బాటసారులు,  భక్తులు, కూలీలు, రైతులు, కార్మికుల కడుపు నింపుతోంది. ఈమె సేవలను గుర్తించిన అదే గ్రామానికి చెందిన దాడిశెట్టి వీరబ్రహ్మం అనే వ్యక్తి ఉచితంగా 10 సెంట్ల స్థలాన్ని ఇచ్చారు. దాంతో రేకుల షెడ్డు నిర్మించి సేవలు కొనసాగిస్తోంది.

ఆమె సేవలు...
గుంటూరు జిల్లా పొన్నూరులో పుట్టారు రత్నమ్మ. వెంకటరెడ్డి, వెంకటసుబ్బమ్మ దంపతుల తొమ్మిది మంది సంతానంలో మొదటి వ్యక్తి. ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నారు. బాల్యంలోనే తట్టువ్యాధి సోకడంతో నడుము, కాళ్లు చచ్చుబడిపోయాయి. అయినా మొక్కవోని దీక్షతో 25 ఏళ్లుగా పలు గ్రామాల్లో సేవలందిస్తున్నారు. ఈ క్రమంలోనే మహానంది మండలంలోని గాజులపల్లె గ్రామం సమీపంలోని నాగిరెడ్డి తోటలోనే సొంతంగా ఓ ప్రయివేటు పాఠశాలను ఏర్పాటుచేసి విద్యాబోధనను సాగించారు. ఈమె దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకున్న ఎంతోమంది ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇదొక్కటే కాదు రాజరాజేశ్వరీ మహిళామండలిని స్థాపించి మహిళలకు ప్లాస్టిక్‌ తీగలతో బుట్టలు అల్లడం, కొవ్వొత్తుల తయారీ నేర్పించి ఆర్థికంగా చేయూతనందించారు. గాజులపల్లె గ్రామంలో బాలికలను బడి బాట పట్టించారు. రూ.2.50 లక్షలు వెచ్చించి మహానంది పంచాయతీలోని మహానందీశ్వర నగర్‌లోని కాశినాయన ఆశ్రమంలో ఓ గదిని నిర్మించారు. అన్నార్తుల ఆకలి తీర్చడమే తన లక్ష్యమంటారు రత్నమ్మ.

- గద్వాల రామకృష్ణుడు, మహానంది


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి