మ్యాజిక్‌ ట్యాబ్లెట్‌ నాప్కిన్‌!

చిన్న మాత్రలా ఉండే కాగితం బిళ్లను కొళాయి కింద పెట్టగానే నీటిని పీల్చుకుంటుంది. ఇందులో వింతేముంది అంటారా...

Published : 31 Aug 2021 00:48 IST

చిన్న మాత్రలా ఉండే కాగితం బిళ్లను కొళాయి కింద పెట్టగానే నీటిని పీల్చుకుంటుంది. ఇందులో వింతేముంది అంటారా... ఆ తర్వాత అందమైన తెల్లని వైప్‌/టవల్‌గా మారిపోతుంది. దీన్ని వేడి/చల్లటి వైప్‌లా.. ఎలా కావాలనుకుంటే అలా వాడుకోవచ్చు. సహజ పీచులతో తయారైన ఇది వందశాతం సురక్షితమైంది, పర్యావరణహితమైంది కూడా. అన్ని చర్మతత్వాలకు సరిపోతుంది. చిన్నగా గోళీ పరిమాణంలో ఉన్న దీన్ని వెంట తీసుకువెళ్లడం చాలా సులువు. ‘మ్యాజిక్‌ కాయిన్‌ ట్యాబ్లెట్‌ టిష్యూ న్యాప్కిన్‌’ పేరిట మార్కెట్లో ఈ న్యాప్కిను దొరుకుతాయి. ఇల్లు, ఆఫీసు, రెస్టారెంట్‌లు, ఆస్పత్రులు, స్కూల్‌్్స, పిక్నిక్‌లు, ప్రయాణాలు, వేడుకలు, పెళ్లిళ్లు.. ఇలా ఎక్కడైనా, ఎప్పుడైనా వీటిని వాడుకోవచ్చు.

వాడకమిలా... దూది ఉండలా వచ్చే వీటిని చేతిలో తీసుకుని కొళాయి నీటి ధార కింద పెట్టాలి. నీళ్లను పీల్చుకున్న తర్వాత ఇది కాగితంలా విడిపోతుంది. దీన్ని మోము, మెడ, చేతులు, శుభ్రం చేసుకోవడానికి వాడుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్