మసాలా మాత్రలు!

వంటకాల్లో ఏవి ఎంత వేయాలో అంత మోతాదులో వేస్తేనే రుచి! కాస్త ఎక్కువయినా... కాస్త తక్కువయినా ఆ వంటకం రుచే మారిపోతుంది. దీన్నే వ్యాపారసూత్రంగా మలుచుకున్నారు కెన్సీవాంగ్‌,

Updated : 27 Aug 2021 12:57 IST

వంటకాల్లో ఏవి ఎంత వేయాలో అంత మోతాదులో వేస్తేనే రుచి! కాస్త ఎక్కువయినా... కాస్త తక్కువయినా ఆ వంటకం రుచే మారిపోతుంది. దీన్నే వ్యాపారసూత్రంగా మలుచుకున్నారు కెన్సీవాంగ్‌, లిసాకార్సన్‌లు.. 

కెన్సీవాంగ్‌ వాళ్ల అమ్మానాన్నలు బోస్టన్‌లో చైనీస్‌ రెస్టరంట్‌ని నడిపేవారు. అక్కడికి వచ్చే వారికి స్వాగతం పలకడం... మెనూని చూపించడం ఆమె పని. ఆ క్రమంలో భోజన ప్రియుల ఇష్టాయిష్టాలని బాగానే పసికట్టేసింది వాంగ్‌. ఇక లిసా... డిజిటల్‌ మార్కెటింగ్‌లో అనుభవం సంపాదించిన తర్వాత.. అనుకోకుండా మసాలాల వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఈ ఇద్దరు స్నేహితురాళ్లు కలిసి చేసిన ఆలోచనే ‘ఓక్కో’. మాసాలపొడులని, దినుసులని చిన్నచిన్న మాత్రల సైజులో వంటకాల అవసరాలని బట్టి ప్యాక్‌ చేస్తారు. చూడ్డానికి ట్యాబ్లెట్‌ స్ట్రిప్‌ మాదిరిగా అనిపించే వీటిని పర్యావరణానికి హాని చేయకుండా రీసైకిల్డ్‌ మెటీరియల్‌తో తయారు చేయడం విశేషం. ఈ పద్ధతిలో ప్యాక్‌ చేయడం వల్ల దినుసులు ముఖ్యంగా వాటి పరిమళాన్ని కోల్పోకుండా ఉంటాయి అంటున్నారు వీళ్లు. అమెరికాలో వీళ్ల ఉత్పత్తులకు ఆదరణ పెరగడంతో మసాలా దినుసులనే కాక... ఇతర ఆహార పదార్థాలనీ, మందులనీ కూడా ఇలా రీసైకిల్డ్‌ మెటీరియల్‌తో తయారు చేయడానికి ఒప్పందాలు చేసుకున్నారీ అమ్మాయిలు. ఆలోచన బాగుంది కదూ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్