ఆఫీసుకు వెళ్లాలంటే భయం
ఇటీవలే నా కలల సంస్థలో ఉద్యోగం వచ్చింది. శిక్షణలో ఉన్నా. ఇలాంటి సంస్థలో పనిచేయాలనేది నా కోరిక. కానీ ఇప్పుడు ఆఫీసుకు వెళ్లాలంటేనే భయమేస్తోంది. ఏదైనా తప్పు చేసి, నవ్వుల పాలవుతానేమోనని ఒకటే కంగారు. కాలేజీలో సరిగా నేర్పించలేదు,
ఇటీవలే నా కలల సంస్థలో ఉద్యోగం వచ్చింది. శిక్షణలో ఉన్నా. ఇలాంటి సంస్థలో పనిచేయాలనేది నా కోరిక. కానీ ఇప్పుడు ఆఫీసుకు వెళ్లాలంటేనే భయమేస్తోంది. ఏదైనా తప్పు చేసి, నవ్వుల పాలవుతానేమోనని ఒకటే కంగారు. కాలేజీలో సరిగా నేర్పించలేదు, ఉద్యోగ బాధ్యతల్లో విఫలమవుతాననిపిస్తోంది. ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలో సలహా ఇవ్వండి.
- ఓ సోదరి, బెంగళూరు
భయమనేది సహజమైన, శారీరక ప్రతిస్పందన. దీన్ని పూర్తిగా నిరోధించడం కష్టం. అయినా భరోసా ఇవ్వడానికి ఈ సూచనలు కొంత వరకూ సాయపడతాయి. ఏ సంస్థా మీరు చేరగానే పని చేయాలనీ, అన్నీ నేర్చేసుకోవాలని ఆశించదు. పైగా.. మొదటి 90 రోజుల్లోనే అన్నీ తెలుసు కోవాలనుకోవడం కొత్తగా చేరిన వాళ్లు చేసే తప్పుగా మేనేజర్లే చెబుతుంటారు. ఇలాంటి ఆందోళన మాని, వీలైనన్ని ప్రశ్నలతో వెళ్లండి. ఫీడ్‌బ్యాక్ తీసుకోవడానికి సుముఖంగా, కొత్తవి నేర్చుకోవడానికి సంసిద్ధత, సానుకూల వైఖరి, చెప్పింది పూర్తిగా వినడం, ఆలోచనాత్మక ప్రశ్నలడగడం వంటివి మీపై పాజిటివ్ అభిప్రాయాన్ని కలిగిస్తాయి. ఆఫీసులో వాళ్లందరినీ కలుస్తూ ఉండండి. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. దీనికీ భయపడకుండా సహజంగా కలిసే ప్రయత్నం చేయండి. దీన్నే నెట్వర్కింగ్ అంటాం. ఇది పని సంస్కృతిని తెలియచెబుతుంది. కొత్త అవకాశాల గురించీ తెలియజేస్తుంది. దీంతో మరింత ఆహ్లాదంగా పని చేయగలుగుతారు. ముందుగా ఎవరిని పరిచయం చేసుకోవాలో మీపై అధికారులు, సహచరులను అడగండి. వీలైతే వారినే పరిచయం చేయమని కోరండి. తర్వాత ఆ స్నేహపూరిత వాతావరణాన్ని కొనసాగిస్తే సరి. ఆందోళన కలిగించే పనిని ముందు చేసేయండి. ఉదాహరణకు... కాలేజీలో సరిగా నేర్పించలేదు అనిపిస్తోంది కదా! వేరే మార్గంలో నేర్చుకునే ప్రయత్నం చేయండి. కాలం, ఆత్మవిశ్వాసం భయాన్ని తగ్గించే గొప్ప మందులు. కాబట్టి, పని మీద దృష్టిపెట్టండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- మంత్రముగ్ధుల్ని చేసేస్తున్నాయి...
- Samantha: పెళ్లి గౌనుని రీసైక్లింగ్ చేయించా.. ఇదంటే ఎంతో ఇష్టం!
- Asoka Makeup Trend: అప్పటి కరీనా లుక్‌ని ఇలా రీక్రియేట్ చేస్తున్నారు!
- ధవళవర్ణంలో దేవకన్యలా..!
- తారలు మెచ్చిన ‘ఫుల్కారీ’ ఫ్యాషన్.. ఈ స్టైలిష్ ట్రెండ్ గురించి తెలుసా?
ఆరోగ్యమస్తు
- డిప్రెషన్ తగ్గించే పాదాంగుష్ఠాసనం
- ఎలా తింటున్నారు
- పగలు నిద్రపోతున్నారా?
- నెలకు రెండుసార్లు పిరియడ్స్.. ఎందుకిలా?
- వీటితో.. కడుపు చల్లగా.. ఆరోగ్యంగా..!
అనుబంధం
- పాట్లక్తో...
- నాన్నంటే భయపడుతున్నారు..!
- ప్రయోగాలతో నేర్పిద్దామా?
- పెంపకం బట్టి ఎదుగుతారు.!
- బద్ధకపు భర్తతో వేగలేకపోతున్నారా?
యూత్ కార్నర్
- Mrunal Thakur: అప్పుడే పెళ్లి చేసుకుంటా.. భవిష్యత్తులో నేనూ దీనికి రడీ!
- టీనాతో ఇంటర్వ్యూకి సిద్ధమా?!
- రాయల్ సొసైటీలో మన స్వెత్లానా!
- వేసవి కథ!
- 29 బాటిళ్లతో ఒక స్విమ్‌సూట్.. విదేశాల్లోనూ పాపులర్!
'స్వీట్' హోం
- ఫర్నిచర్‌పై మరకలు పోవాలంటే..!
- ఈ డ్రింక్‌తో వేసవి వేడిని తరిమేయండి!
- రాత్రివేళకి... సుగంధాల రాణి!
- చెత్తబుట్ట నుంచి దుర్వాసన రాకుండా..!
- తేలిగ్గా వండేద్దాం..!
వర్క్ & లైఫ్
- అక్కడ బిడ్డను కంటే రూ. 60 లక్షల బహుమతి!
- థైరాయిడ్‌తో బరువు పెరిగా...
- పట్టు చిక్కాలంటే... ప్రణాళిక ఉండాలి...
- గర్ల్ గ్యాంగ్‌తో వెకేషనా? అందాల ‘బాలి’ వెళ్లాల్సిందే!
- రంగులు తెలిసేలా!