బాబు, ఉద్యోగం.. సమయమేది?

నాకు నాలుగేళ్ల బాబున్నాడు. అత్తమామలు మాతోనే ఉంటారు. బాబు పుట్టాక  విరామం తీసుకుని 8 నెలల క్రితమే తిరిగి ఉద్యోగంలో చేరా. ఇతర మహిళలు ఎలా నెట్టుకొస్తున్నారో కానీ.. నాకు మాత్రం దేనికీ సమయం ఉండట్లేదు. మా వారు వ్యాపారి. నేను ఉద్యోగం కొనసాగిస్తానన్నప్పుడే తను పెద్దగా సాయం చేయలేనని చెప్పేశారు. నేను పని చేయాలనుకుంటున్నా. ఆ విషయంలో సందేహం లేదు. సమన్వయం చేసుకుంటూ ఎలా ముందుకెళ్లాలో సలహా ఇవ్వగలరా...

Updated : 22 Dec 2021 05:00 IST

నాకు నాలుగేళ్ల బాబున్నాడు. అత్తమామలు మాతోనే ఉంటారు. బాబు పుట్టాక  విరామం తీసుకుని 8 నెలల క్రితమే తిరిగి ఉద్యోగంలో చేరా. ఇతర మహిళలు ఎలా నెట్టుకొస్తున్నారో కానీ.. నాకు మాత్రం దేనికీ సమయం ఉండట్లేదు. మా వారు వ్యాపారి. నేను ఉద్యోగం కొనసాగిస్తానన్నప్పుడే తను పెద్దగా సాయం చేయలేనని చెప్పేశారు. నేను పని చేయాలనుకుంటున్నా. ఆ విషయంలో సందేహం లేదు. సమన్వయం చేసుకుంటూ ఎలా ముందుకెళ్లాలో సలహా ఇవ్వగలరా?

- మాధవి, హైదరాబాద్‌


ని చేసే మహిళలందరూ ఎదుర్కొంటున్నదే ఇది. అందరికీ 24 గంటలే ఉన్నాయి. దాన్ని ఎలా సద్వినియోగం చేస్తున్నామన్నదే ప్రధానం. కాబట్టి..

నిద్రకు సమయం: పనేమీ లేకపోతే చిన్న కునుకు తీయండి. తగినంత విశ్రాంతి లేకపోతే దేన్నీ సకాలంలో పూర్తిచేయలేరు. సమయమూ వృథా. ఇతర పనుల్లాగే మీ, పిల్లల నిద్రనూ ప్లాన్‌ చేసుకోండి. అప్పుడే మరుసటిరోజు పనిని ఉత్సాహంగా చేయగలరు.

పని వేళలు: బాధ్యతలు స్వీకరించే ముందే పని వేళలను నిర్థరించుకోండి. అవి ముగిశాక ఎంతవరకూ అందుబాటులో ఉంటారన్న విషయంపైనా స్పష్టతన్వివండి. చాలామంది తల్లులు రాత్రులు, వారాంతాలను కుటుంబం కోసమే కేటాయించుకుంటారు.

‘నో’ చెప్పండి: సమావేశాలు, ఫీల్డ్‌ ట్రిప్స్‌, ఇతర పని ప్రాజెక్ట్‌లు అన్నింటికీ మీరే వెళ్లాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు కొంత కష్టమైనా నో చెప్పడం అలవాటు చేసుకోండి. ఇదీ ఓ నైపుణ్యమే. మీ పరిధులను నిర్ణయించుకునే ఈ తీరు మీ పిల్లలకూ పాఠమవుతుంది.
లక్ష్యాలు: రోజువారీ పనులను జాబితాగా రాసుకోండి. దాన్ని సిద్ధం చేసేముందు మీరు సూపర్‌ హీరో కాదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. సాధించలేని పనులను రాస్తూ వెళ్లకండి. దానివల్ల ప్రయోజనముండదు. వాస్తవికతను దృష్టిలో పెట్టుకోండి. సమయముంటే ఎలాగూ మీరే అదనపు పని చేస్తారు కదా!

చాలా గ్యాప్‌ తర్వాత తిరిగి పని ప్రారంభించారు. కాబట్టి, అలసటగా అనిపిస్తుండొచ్చు. ఓపిక పట్టండి. సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో క్రమంగా మీకే అవగాహన వస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్