Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఎడిట్‌ ఆప్షన్‌.. మెసేజుల్లో పొరపాట్లకు చెక్‌

Instagram: వాట్సప్‌, టెలిగ్రామ్‌ వంటి యాప్‌లకే పరిమితమైన మెసేజ్‌ ఎడిట్‌ ఫీచర్‌ని ఇన్‌స్టాగ్రామ్‌ తీసుకొచ్చింది. దీన్ని ఎలా ఉపయోగించాలంటే?

Published : 03 Feb 2024 02:15 IST

Instagram | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) యాప్‌ను వినియోగిస్తున్నారా? మీరు పంపిన మెసేజ్‌లో ఏదైనా తప్పులు దొర్లితే సరిదిద్దుకొనే ఆప్షన్‌ ఉంటే బాగుంటుందని ఎప్పుడైనా అనిపించిందా? అయితే, మీకో గుడ్‌న్యూస్‌.. ఇకపై ఇన్‌స్టాగ్రామ్‌లో పంపిన మెసేజ్‌లో తప్పులుంటే వెంటనే సరిచేసుకునేందుకు వీలుగా ‘ఎడిట్‌’ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చేసింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ తన బ్లాగ్‌లో వెల్లడించింది.

190km రేంజ్‌తో ఓలా కొత్త స్కూటర్‌.. ఇక 8 ఏళ్ల బ్యాటరీ వారెంటీ

ఇప్పటివరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పంపిన మెసేజ్‌లో ఏవైనా తప్పులుంటే వాటిని డిలీట్‌ చేయడం మినహా మరో ఆప్షన్‌ లేదు. ఇటువంటి సమస్యలకు చెక్‌ పెడుతూ ఇన్‌స్టాగ్రామ్‌ మెసేజ్‌ ‘ఎడిట్‌’ (Edit) ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు వాట్సప్‌ (WhatsApp), టెలిగ్రామ్‌ (Telegram) యాప్‌లకు మాత్రమే పరిమితమైన ఈ ఫీచర్‌ ఇకపై ఇన్‌స్టాగ్రామ్‌లో అందుబాటులో ఉండనుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదైనా మెసేజ్‌ పంపిన తర్వాత దాన్ని సెలెక్ట్‌ చేస్తే ‘edit’ ఆప్షన్‌ ఉంటుంది. దాన్ని క్లిక్‌ చేసి పంపిన మెసేజ్‌లో తప్పులు సరిచేయొచ్చు. మెసేజ్‌ పంపిన 15 నిమిషాల్లోపు ఐదు సార్లు మాత్రమే ఎడిట్‌ చేసే వెసులుబాటు ఉంటుంది. ఎడిట్‌ చేసినట్లు అవతలి వ్యక్తికి లేబుల్‌ కనిపిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని