Vivo V29e: 50MP సెల్ఫీ కెమెరాతో వీ29 సిరీస్‌లో వివో కొత్త ఫోన్‌

Vivo V29e: వివో వీ29 సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ భారత మార్కెట్‌లో విడుదలైంది. ఫీచర్ల విషయంలో ఇది వీ29 లైట్‌ 5జీని పోలి ఉండడం గమనార్హం. 

Published : 28 Aug 2023 16:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మొబైల్‌ తయారీ సంస్థ వివో.. వీ29 సిరీస్‌లో మరోకొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. వీ29ఈ (Vivo V29e) పేరిట విడుదల చేసిన ఈ మొబైల్‌లో వీ29 లైట్‌ 5జీ మోడల్‌ తరహా ఫీచర్లు ఉన్నాయి. కెమెరాను మాత్రం మరింత మెరుగుపర్చారు. ఈ కొత్త ఫోన్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 695 ప్రాసెసర్‌తో వస్తోంది. 5,000mAh బ్యాటరీని పొందుపర్చారు. ఇది రెండు రంగుల్లో అందుబాటులో ఉంది.

వివో వీ29ఈ ధర..

వివో ‘వీ29ఈ’ (Vivo V29e) రెండు స్టోరేజ్‌ వేరియంట్లలో వస్తోంది. 8GB + 128GB వేరియంట్‌ ధర భారత్‌లో రూ.26,999. 8GB + 256GB ధర రూ.28,999. ఆర్టిస్టిక్‌ బ్లూ, ఆర్టిస్టిక్‌ రెడ్‌ కలర్లలో ఈ ఫోన్‌ను పొందొచ్చు. వివో ఈ-స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ఈరోజు నుంచి ప్రీఆర్డర్లు ప్రారంభమయ్యాయి. సెప్టెంబరు 7 నుంచి ఎంపిక చేసిన స్టోర్లలో విక్రయానికి అందుబాటులో ఉంటుంది. ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ కింద కంపెనీ ఈ మొబైల్‌పై రూ.2,000 రాయితీ ఇస్తోంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2,500 తగ్గింపు లభించనుంది. అలాగే కొన్ని కార్డులపై 10 శాతం క్యాష్‌బ్యాక్‌ కూడా ఉంది.

వివో వీ29ఈ ఫీచర్లు..

వివో వీ29ఈ (Vivo V29e)లో 6.78 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ తెరను అందిస్తున్నారు. దీని రీఫ్రెష్‌ రేటు 120Hz. రెండు నానో సిమ్‌ స్లాట్స్‌తో వస్తున్న ఈ ఫోన్‌ ఆక్టాకోర్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 695 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత ఫన్‌టచ్‌ఓస్‌ 13తో వస్తోంది. వెనుక భాగంలో 64MP ప్రధాన కెమెరాతో పాటు ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరా ఉంది. 5జీ, 4జీ, వైఫై 802.11, బ్లూటూత్‌ వీ5.1, జీపీఎస్‌, యూఎస్‌బీ టైప్‌-సి వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని