పెళ్లికి.. కులం అడ్డని చెబుతున్నారు

చిన్నతనం నుంచీ అమ్మానాన్నలు చాలా స్వేచ్ఛగా పెంచారు. చదువూ, ఉద్యోగం ఏ విషయంలోనూ బలవంతపెట్టలేదు. ప్రేమించిన వ్యక్తిని చేసుకుంటానంటే మాత్రం తక్కువ కులమని అభ్యంతరం చెబుతున్నారు. ఇంట్లోంచి వెళ్లి పెళ్లి చేసుకోవడం తేలికే. కానీ అమ్మానాన్నలను బాధపెట్టడం ఇష్టంలేదు. ఏం చేయాలో తెలియడంలేదు.

Published : 05 Sep 2022 01:14 IST

ప్రశ్న: చిన్నతనం నుంచీ అమ్మానాన్నలు చాలా స్వేచ్ఛగా పెంచారు. చదువూ, ఉద్యోగం ఏ విషయంలోనూ బలవంతపెట్టలేదు. ప్రేమించిన వ్యక్తిని చేసుకుంటానంటే మాత్రం తక్కువ కులమని అభ్యంతరం చెబుతున్నారు. ఇంట్లోంచి వెళ్లి పెళ్లి చేసుకోవడం తేలికే. కానీ అమ్మానాన్నలను బాధపెట్టడం ఇష్టంలేదు. ఏం చేయాలో తెలియడంలేదు.

- ఓ సోదరి, భీమవరం

మ్మానాన్నలు స్వేచ్ఛ ఇవ్వడంతో చక్కగా చదువుకోగలిగారు. ఉద్యోగం చేసుకుంటున్నారు. ప్రేమ వ్యక్తిగతమైనా లోకంలో జరుగుతున్న పోకడలు చూసి వైవాహిక జీవితంలో కష్టపడకుండా సుఖసంతోషాలతో ఉండాలనే పెద్దవాళ్లు అభ్యంతరం చెబుతుండవచ్చు. కులం మాత్రమే వ్యతిరేకత అయ్యుండదు. మీరు ఇష్టపడిన వ్యక్తిలో సుగుణాల గురించి అమ్మానాన్నలకు చెప్పండి. అతన్ని గమనించమని కూడా చెప్పండి. మీకెటూ వాళ్ల మీద గౌరవం ఉంది కనుక ఎందుకు భయపడుతున్నారో చూడండి. ఇప్పుడున్న ఆవేశం తర్వాత ఉండదు. చదువు, ఉద్యోగం, మనస్తత్వం.. అన్ని విధాలా బాగున్నాడు, అమ్మాయిని బాగా చూసుకుంటాడు అనే నమ్మకం కలిగితే అంగీకరించే అవకాశం ఉంటుంది. కనుక ఇలాంటి విషయాల్లో వాళ్లకీ సమయం ఇవ్వాలి, మీరూ తీసుకోవాలి. అప్పుడే ఒకర్నొకరు అర్థం చేసుకోగలుగుతారు. తొందరపడ్డానని మీకూ అనిపించకూడదు. కొన్ని విషయాలను కాలమే పరిష్కరిస్తుందని మర్చిపోవద్దు. అలాగని ఊరికే కూర్చోమని కాదు. ఈలోపు వాళ్లేంటో అందరూ గమనిస్తూ ఉండండి. మీది మంచి నిర్ణయం అనిపించాలంటే అన్నివిధాలా ఆలోచించి ఆచితూచి అడుగేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని