లిప్‌బామ్‌లో ఏముండాలి?

ఎంత ఖరీదైన లిప్‌బామ్‌లు వాడినా పెదాలు తరచూ పొడిబారుతున్నాయి. ఆయుర్వేదిక్‌ కొన్నా ఇదే పరిస్థితి. తక్కువ ఖరీదువి వాడాలంటేనేమో భయం. అసలు వీటిల్లో ఏమున్నవి తీసుకుంటే ప్రయోజనం?

Published : 04 Feb 2024 01:50 IST

ఎంత ఖరీదైన లిప్‌బామ్‌లు వాడినా పెదాలు తరచూ పొడిబారుతున్నాయి. ఆయుర్వేదిక్‌ కొన్నా ఇదే పరిస్థితి. తక్కువ ఖరీదువి వాడాలంటేనేమో భయం. అసలు వీటిల్లో ఏమున్నవి తీసుకుంటే ప్రయోజనం?

ఓ సోదరి

వాతావరణంలోని మార్పుల ప్రభావం మొదట పడేది పెదాలపైనే! అతి చల్లదనమైనా, వేడిగా ఉన్నా పొడిబారతాయి. పెదాలను తరచూ నాలుకతో తడపడం, అలర్జీలు, థైరాయిడ్‌, ఐరన్‌, బి విటమిన్‌ లోపం, తగినంత నీటిని తాగకపోవడం... ఇలా దీనికి బోలెడు కారణాలు. అతిగా లిప్‌స్టిక్‌ వేసుకునే వారిలోనూ ఈ సమస్య కనిపిస్తుంది. రోజు మొత్తంలో ఒకసారి, రెండుసార్లు లిప్‌బామ్‌ రాసి, సరైన తేమ అందడం లేదు అనడం కూడా సరికాదు. పెదాలపైన చర్మం చాలా పలుచగా ఉంటుంది. పైగా దీనిపై నూనెగ్రంథులు ఉండవు కాబట్టి, వాటికి ఎప్పటికప్పుడు పోషణ అందించాలి. రోజూ మూడు లీటర్ల నీటిని తాగండి. వీలుంటే ఇంట్లో హ్యుమిడిఫయర్‌ని ఏర్పాటు చేసుకోండి. వాటితోపాటు పెట్రోలియం జెల్లీ, విటమిన్‌ ఇ, మినరల్‌ ఆయిల్స్‌, సెరమైడ్స్‌, టైటానియం ఆక్సైడ్‌, జింక్‌ ఆక్సైడ్‌ ఉన్న లిప్‌బామ్‌లు ఎంచుకుంటే సరి. ఎస్‌పీఎఫ్‌ ఉండేలానూ చూసుకోవాలి. సువాసన బాగుంది, రంగు ఆకర్షిస్తోందని ఫ్రూట్‌, ఫ్లవర్‌ ఫ్లేవర్లు, మెంథాల్‌, వ్యాక్స్‌, యూకలిప్టస్‌ ఉన్నవాటిని వాడొద్దు. ఇవి సమస్యను పెంచుతాయి. కొన్నిసార్లు కొన్నిరకాల టూత్‌పేస్టులు కూడా పడవు. అదేమైనా కారణమేమో చెక్‌ చేసుకోండి. తరచూ స్క్రబింగ్‌, పొట్టుతీయడం, ఆలోచిస్తూ ఏదో ఒకటి నోట్లో పెట్టుకోవడం లాంటివీ చేయొద్దు. బయటి వాటితోనే సమస్య అనిపిస్తే... స్పూను చొప్పున కొబ్బరి, బాదం నూనెలు, బీస్‌వ్యాక్స్‌, కోకోవా బటర్‌లను ఒక గిన్నెలోకి తీసుకొని, డబుల్‌ బాయిల్‌ పద్ధతిలో వేడిచేయాలి. దించాక రెండు చుక్కల ఎసెన్షియల్‌ ఆయిల్‌ కలపాలి. ఆరాక చిన్న డబ్బాలోకి తీసుకొని, దాన్నే పెదాలకు రాసుకున్నా అలర్జీల భయం ఉండదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్