కాంతినిచ్చే ఎండు ద్రాక్ష!

చర్మంపై టాన్‌ పేరుకోవడానికి బోలెడు కారణాలు. దీన్ని తొలగించుకోవడానికి ఇంట్లో ఉండే పదార్థాలే చాలు. అవేంటో తెలుసుకుందాం...

Published : 03 Jun 2021 01:28 IST


చర్మంపై టాన్‌ పేరుకోవడానికి బోలెడు కారణాలు. దీన్ని తొలగించుకోవడానికి ఇంట్లో ఉండే పదార్థాలే చాలు. అవేంటో తెలుసుకుందాం...
రెండు చెంచాల బార్లీ పౌడర్‌ని కప్పు నీళ్లల్లో ఉడకబెట్టుకోవాలి. ఆ మిశ్రమానికి రెండు చెంచాల ఎండు ద్రాక్ష గుజ్జు, చెంచా నిమ్మరసం, కొద్దిగా రోజ్‌వాటర్‌ కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ ప్యాక్‌ని తరచూ ముఖానికి వాడుతుంటే... ఎండ కారణంగా నల్లబడిన చర్మం ఉపశమనం పొందుతుంది.
*రెండు చెంచాల పెసరపిండిలో చెంచా సెనగపిండి, చెంచా చొప్పున కీరదోస, ఎండు ద్రాక్ష గుజ్జు, కాస్త పెరుగు వేసి మెత్తగా చేయాలి. దీన్ని ఒంటికి రాసి నలుగులా రుద్దితే... చర్మంపై మృతకణాలు పోతాయి. నలుపు తగ్గుతుంది. ముఖం వన్నెలీనుతుంది.
* నాలుగు ఎండుద్రాక్షలు, ఒక ఎండు ఖర్జూరం నానబెట్టుకుని వాటిని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమానికి కొద్దిగా నిమ్మరసం చేర్చి ముఖానికి రాస్తే సరి. కళగా కనిపిస్తుంది.



నిద్రపోయే ముందు క్లెన్సర్‌తో ముఖాన్ని తుడిస్తే మురికి తొలగిపోతుంది. ఆపై గంధం రాసుకుంటే... వేసవిలో సాధారణంగా తలెత్తే యాక్నె సమస్యలు ఎదురుకావు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్