పాలు ఇస్తుంటే వాడొద్దా?
గర్భంతో ఉన్నప్పుడు ముఖమ్మీద నల్లమచ్చలా వచ్చింది. బిడ్డకి హాని అని ఏ క్రీములూ వాడలేదు. ప్రసవమయ్యాకా పాపాయి పాలు తాగుతోంటే వాడొద్దంటున్నారు.
గర్భంతో ఉన్నప్పుడు ముఖమ్మీద నల్లమచ్చలా వచ్చింది. బిడ్డకి హాని అని ఏ క్రీములూ వాడలేదు. ప్రసవమయ్యాకా పాపాయి పాలు తాగుతోంటే వాడొద్దంటున్నారు. నిజమేనా? బిడ్డకి ప్రమాదం లేకుండా తగ్గించుకునే మార్గం చెప్పండి.
- ఓ సోదరి
గర్భం దాల్చినపుడు శరీరంలో రకరకాల మార్పులొస్తాయి. మెలనోసైట్ల ఉత్పత్తి పెరిగితే ఇలా వస్తుంటుంది. దీన్ని కొలస్మా అంటాం. కొందరిలో ముఖమ్మీద.. ఇంకొందరిలో శరీరంలో ఎక్కడైనా కనిపిస్తుంటుంది. స్క్రీన్, మేకప్ ఎక్కువగా వాడేవాళ్లు.. మెనోపాజ్‌లోకి అడుగుపెట్టిన వాళ్లలోనూ వస్తుంటుంది. ఎండకి వెళితే ప్యాచ్‌లు ఇంకొంచెం నల్లగా మారతాయి. ప్రెగ్నెన్సీలో వచ్చిందంటున్నారు. కాబట్టి, చాలావరకూ దానంతటదే కొన్ని నెలల్లో తగ్గిపోతుంది. అందుకని దాదాపుగా ఎలాంటి క్రీములూ సూచించం. వీలైనంతవరకూ ఎండలోకి వెళ్లొద్దు. వెళ్లాల్సొస్తే జింక్ ఆక్సైడ్, టైటానియం డయాక్సైడ్, మినరల్స్ ఉన్న సన్‌స్క్రీన్, ఎస్‌పీఎఫ్ 30 ఉన్నవి వాడండి. స్కార్ఫ్, టోపీ వంటివీ తప్పనిసరిగా ఉపయోగించాలి. అప్పటికీ తగ్గకపోతే పాపాయి పాలు మానేశాక పగలు ఆల్ఫాహైడ్రాక్సీ, మాండలిక్ యాసిడ్, ఎజిలాయిక్ యాసిడ్, గ్లైకాలిక్ యాసిడ్.. రాత్రి టాపికల్ రెటినాయిక్ క్రీములు వాడొచ్చు. ఇంకా ఎండియాగ్, అలెగ్జాండ్రీ, ఐపీఎల్ లేజర్, మైక్రోడర్మాబ్రేషన్, కెమికల్ పీల్స్ చేయించుకోవచ్చు. మరీ ఇబ్బందిగా అనిపిస్తే రసాయనాల్లేని నాన్ కమడోజెనిక్, ఫ్రాగ్రెన్స్ ఫ్రీ క్రీములు, సీరమ్‌లతోపాటు సన్‌స్క్రీన్ వాడండి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉన్నవాటితోపాటు ఆరోగ్యకరమైన, తాజా ఆహారం, నిద్రకి ప్రాధాన్యమివ్వండి. ఐరన్, బి12 కొరత ఉందేమో చెక్ చేయించుకొని సంబంధిత మందులు వాడండి. అర స్పూను చొప్పున నిమ్మరసం, కీర రసం లేదా ఓట్‌మీల్‌లో తేనె కలిపి ముఖానికి రాసి, ఆరాక కడిగేయాలి. వీటిని రోజూ ప్రయత్నించినా ఫలితం ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.