మెనోపాజ్‌ సమస్యలకు అరికెలతో చెక్‌

ఆరోగ్య సంరక్షణలో భాగంగా ఎంతో ఇష్టమైనా కొన్నింటిని పక్కన పెట్టకతప్పదు. వరి, గోధుమల విషయంలో ఆ పరిస్థితి ఎదురైనవారు వాటి స్థానంలో అరికెలను తీసుకోవచ్చు. దీనివల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయి.

Published : 31 Jul 2021 03:03 IST

ఆరోగ్య సంరక్షణలో భాగంగా ఎంతో ఇష్టమైనా కొన్నింటిని పక్కన పెట్టకతప్పదు. వరి, గోధుమల విషయంలో ఆ పరిస్థితి ఎదురైనవారు వాటి స్థానంలో అరికెలను తీసుకోవచ్చు. దీనివల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయి.
అరికెల్లో ఐరన్‌, క్యాల్షియం, విటమిన్‌ బి1, బి3 ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయులతోపాటు కొలెస్ట్రాల్‌నూ తగ్గిస్తాయి.
* మెనోపాజ్‌ దశలో మహిళలు ఎదుర్కొనే ఎన్నో సమస్యలకు చెక్‌ పెట్టేస్తాయి. ఆ దశ తర్వాత ఎదుర్కొనే గుండె సంబంధ సమస్యలు, రక్తపోటును దూరం చేస్తాయి.
* వీటిలో ఉండే ఫైటో కెమికల్స్‌ క్యాన్సర్లని దూరంగా ఉంచుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి అరికెలు మంచి ఎంపిక.
* దీంట్లో ఉండే ఫెర్యూలిక్‌, హైడ్రాక్సీ బెంజాయిక్‌, వెనిలిక్‌ యాసిడ్‌లు యాంటీ డయాబెటిక్‌గా పనిచేస్తాయి. కాబట్టి, మధుమేహులకు రోజువారీ ఆహారంగా ఇవ్వొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్