ఆమె ఆరోగ్యానికో ట్రాకర్‌!

కెరియర్‌, కాలుష్యం, తరచూ మారే పనివేళలు.. కారణమేదైనా ఆడవాళ్ల విషయాల్లో ఎక్కువగా ప్రభావం పడేది నెలసరిపైనే! దీంతో సంతానోత్పత్తి విషయంలో సమస్యలు.

Published : 23 Aug 2021 01:45 IST

కెరియర్‌, కాలుష్యం, తరచూ మారే పనివేళలు.. కారణమేదైనా ఆడవాళ్ల విషయాల్లో ఎక్కువగా ప్రభావం పడేది నెలసరిపైనే! దీంతో సంతానోత్పత్తి విషయంలో సమస్యలు. ఇందుకో పరిష్కారంగా తయారైందే ‘ఏవా ఫెర్టిలిటీ ట్రాకర్‌’. ఇది నెలసరి, అండం విడదలయ్యే సమయం నుంచి ప్రెగ్నెన్సీలో మార్పుల వరకూ తెలియజేస్తుంది. శరీర ఉష్ణోగ్రత, పల్స్‌, శ్వాస రేటు, గుండె చప్పుడు మొదలైన అంశాల ఆధారంగా డేటా నమోదు చేస్తుంది.  నెలసరికి సంబంధించిన సమస్యలే కాకుండా కచ్చితమైన గర్భధారణ సమయాన్నీ సూచిస్తుంది. దాని ఆధారంగానూ సంతానానికి సంబంధించిన ప్రణాళికను చేసుకోవచ్చు. ఇదో సిలికాన్‌ బ్రేస్‌లెట్‌. ఫోన్‌ యాప్‌తో అనుసంధానమై పనిచేస్తుంది. రాత్రి సమయంలో చేతికి పెట్టుకుంటే సరి. బ్లూటూత్‌/ యూఎస్‌బీ ఆధారంగా పనిచేస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్