కెరియర్‌ ట్రెండ్స్‌నీ ఫాలోకండి
close
Updated : 15/11/2021 06:09 IST

కెరియర్‌ ట్రెండ్స్‌నీ ఫాలోకండి!

అమ్మాయిలకు ఫ్యాషన్‌ స్పృహ ఎక్కువే. కొనకపోయినా ట్రెండ్స్‌ను ఫాలో అవుతుంటాం. మరి కెరియర్‌ సంగతేంటి. దీనిలోనూ ట్రెండ్స్‌ ఉంటాయి. అవీ ఏటికేడు మారుతుంటాయి. నిలదొక్కుకోవాలంటే వాటి గురించీ తెలుసుకోవాల్సిందే!

పోటీ ప్రపంచంలో నిన్న ఉన్నట్టుగా నేడు ఉండటం లేదు. మార్పులు చాలా వేగంగా జరుగుతున్నాయి. నిలదొక్కుకోవాలంటే అందుకు తగ్గట్టుగా మార్పు చెందాలి. సంస్థలూ ఇందుకు మినహాయింపు కాదు. అందుకే పనిచేసే తీరు, టెక్నాలజీల్లో ఎప్పటికప్పుడు మార్పులొస్తుంటాయి. వాటిని అందుకోవడానికి అకడమిక్‌ పరిజ్ఞానం మాత్రమే సరిపోదు. అదనంగా నేర్చుకోవాలి. అది రెండు రకాలుగా సాగాలి.

* పరిశ్రమాధారితం: ఇందుకు పరిశ్రమ ప్రస్తుత పరిస్థితిపై అవగాహన అవసరం. దానికి సంబంధించిన వార్తలను గమనిస్తే.. అభివృద్ధి, తాజా పోకడలు, భవిష్యత్తు అవకాశాలు మొదలైన వాటిపై అవగాహన వస్తుంది. అభివృద్ధి బాగుంటే దానిలో నిలదొక్కుకోడానికి కావాల్సిన టెక్నికల్‌, సబ్జెక్టు నైపుణ్యాలను నేర్చుకోవాలి. ఇందుకు అవసరమైతే ఇదివరకే దానిలో పనిచేస్తున్న వారి సాయమూ తీసుకోవచ్చు.

* సాఫ్ట్‌స్కిల్స్‌: వీటిని తక్కువ అంచనా వేయకండి. వీటిలోనూ ఏటా మార్పులొస్తుంటాయి. అయితే.. కమ్యూనికేషన్‌, సృజనాత్మక ఆలోచన, సమస్య పరిష్కారం, భావోద్వేగ ప్రజ్ఞ మొదలైన వాటికి ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. ముందు వీటిపై పట్టు తెచ్చుకోవాలి. తర్వాత ఆశిస్తున్న ఉద్యోగం, హోదానుబట్టి ఇంకేం అవసరమో నేర్చుకుంటుండాలి. అలాగే పని ప్రదేశంలో సంబంధ బాంధవ్యాలపైనా అవగాహన ఏర్పరచుకుంటే.. భవిష్యత్తుకి సిద్ధమైనట్లే.


Advertisement

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని