కెమికల్ పీల్ మంచిదేనా?
ముఖం మీద మొటిమలొచ్చాయి. ఎన్ని ఉత్పత్తులు మార్చినా ప్రయోజనం లేదు. స్నేహితురాలు కెమికల్ పీల్ చేయించుకోమని సలహా ఇచ్చింది. అసలేమిటిది? ఇంకా ఏమేం చికిత్సలున్నాయ్?
ముఖం మీద మొటిమలొచ్చాయి. ఎన్ని ఉత్పత్తులు మార్చినా ప్రయోజనం లేదు. స్నేహితురాలు కెమికల్ పీల్ చేయించుకోమని సలహా ఇచ్చింది. అసలేమిటిది? ఇంకా ఏమేం చికిత్సలున్నాయ్?
- శ్రావ్య
చర్మంలో ఆయిల్స్ ఎక్కువ మొత్తంలో విడుదలవ్వడం, బ్యాక్టీరియా, హార్మోన్లు కారణంగా యాక్నే వస్తుంది. బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్ రూపంలో వచ్చే వాటిని నాన్ ఇన్‌ఫ్లమేటరీ కింద చెబుతాం. ఇవి క్రీమ్‌లకు తగ్గుతాయి. కురుపులు, గడ్డలు, పొక్కులు ఇన్‌ఫ్లమేటరీ యాక్నే. యాంటీ క్లెండమైసిన్, నికోటినమైన్, బెంజెల్ పెరాక్సైడ్, సాల్సిలిక్ యాసిడ్ వంటివి ఉన్న క్రీమ్స్, ఓరల్ యాంటీబయాటిక్స్ ద్వారా వీటిని తగ్గించుకోవచ్చు. తగ్గకపోతే ఓరల్ రెటినాయిడ్స్‌నూ రిఫర్ చేస్తాం. వీటివల్లా ప్రయోజనం లేనపుడు అడ్వాన్స్‌డ్ ట్రీట్‌మెంట్‌కు వెళతాం. వీటిని డాక్టర్ ఆధ్వర్యంలోనే చేయించుకోవాలి. లైట్ థెరపీలో.. బ్లూ, రెడ్ లైట్ల ద్వారా ఎరుపుదనం, వాపు తగ్గుతాయి. బ్యాక్టీరియా పోయి మొటిమలూ తగ్గుతాయి. లేజర్ థెరపీలో గ్రంథుల పరిమాణం తగ్గి, నూనెలు ఎక్కువగా విడుదల కావు. కొందరికి స్టెరాయిడ్ ఇంజక్షన్‌లూ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక సూపర్ ఫిషియల్ కెమికల్ పీల్ యాక్నేతోపాటు చర్మ రంధ్రాల్లోని మృతకణాలనూ నిర్మూలిస్తుంది. వైట్, బ్లాక్ హెడ్స్‌తోపాటు మచ్చలనూ తొలగిస్తుంది. ఇవి రకరకాలుగా ఉంటాయి. చర్మతత్వం, యాక్నే పరిమాణం బట్టి నిర్ణయిస్తారు. డాక్టర్ సలహా మేరకే చేయించుకోవాలి. అంతకన్నా ముందు చర్మాన్ని సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇందుకు కొన్ని క్రీమ్‌లను ఇస్తారు. తద్వారా చర్మం వీటికి అలవాటు పడుతుంది. తర్వాత పీల్ చేస్తే చర్మానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అయితే వాటిని వైద్యుల ఆధ్వర్యంలోనే చేయించుకోవాలి. కెమికల్ పీల్ తర్వాత ఎండలో పెద్దగా తిరగకూడదు. వెళ్లాల్సొస్తే సన్‌స్క్రీన్ తప్పక రాసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.